Puneeth Rajkumar: పునీత్ జేమ్స్ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథులుగా మెగాస్టార్…. తారక్!

Puneeth Rajkumar:కన్నడ పవర్ స్టార్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న దివంగత పునీత్ రాజ్ కుమార్ చివరిగా నటించిన చిత్రం జేమ్స్.ఈ సినిమా ఆయన మరణాంతరం విడుదల కావడంతో ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెరిగాయి ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాని మార్చి 17వ తేదీ విడుదల చేయాలని చిత్రబృందం భావించారు.ఇక ఈ సినిమా విడుదల రోజున ఇతర ఏ సినిమాలు కూడా విడుదల కాకూడదని ఈ సినిమాని పునీత్ కు అంకితం ఇవ్వాలని డిస్ట్రిబ్యూటర్లు భావించినట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా మార్చి 17వ తేదీ విడుదల కావడంతో మార్చి ఆరో తేదీ ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేశారు.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకల కోసం మన తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఇద్దరు ముఖ్య అతిథులుగా పాల్గొనబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. నటుడు పునీత్ రాజ్ కుమార్ తో తెలుగు హీరోలకు కూడా ఎంతో మంచి అనుబంధం ఉంది. అలాంటి వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి ఒకరని చెప్పవచ్చు.

ఈ క్రమంలోనే పునీత్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు కోసం వీరిద్దరు ముఖ్య అతిథులుగా పాల్గొనబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నప్పటికీ ఈ విషయంపై ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక తారక్ పునీత్ మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది ఆయన మరణవార్త తెలియగానే తారక్ ఎమోషనల్ అవుతూ హుటాహుటిన బెంగుళూరు కి వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ కోసం తారక్ మెగాస్టార్ ఇద్దరు ఒకే ప్రేమ్ లో కనిపించబోతున్నారని తెలియడంతో వీరి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.