బిగ్‌ బాస్ కంటెస్టెంట్స్ తో మెగాబాస్ నాగబాబు పార్టీ.. వీడియో వైర‌ల్

న్యూ ఇయర్ అనగానే ఎక్కడలేని ఉత్సాహం, సంతోషంతో ఎంజాయ్ చేస్తుంటారు. అలాంటి రోజున సెలెబ్రిటీస్ గ్రాండ్ గా పార్టీ సెలెబ్రేట్ చేసుకోవడం మామూలే.. అయితే ఈసారి బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్ తో మెగా బాస్ కొణిదెల నాగబాబు ఓ ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు. ఈ ప్రోగ్రామ్ లో బిగ్ బాస్ టాప్ కంటెస్టెంట్స్ ఎంతో ఎంజాయ్ చేశారు. ఆట, పాటలతో ఎంజాయ్ చేశారు. నోయల్, సోహెల్, అవినాష్, అఖిల్ లు డాన్సులతో ప్రేక్షకుల్ని అలరించారు. నాగబాబు సారథ్యంలో కేక్ కట్ చేసి అందరూ తమ ఆనందాన్ని షేర్ చేసుకున్నారు. ఇక మన లేడీ గ్యాంగ్ సుజాత, అరియానా గ్లోరీ, లాస్య, కేక్ కటింగ్ తో ఫుల్టూ బిందాస్ గా అల్లరి చేశారు.

నాగబాబు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ గురించి వివరించడం ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. బిగ్ బాస్ లో జరిగిన ఫన్నీ ఈవెంట్స్, సీరియస్ చర్చలు గురించి మాట్లాడారు. లైఫ్ అనేది బిగ్ బాస్ హౌస్ లా ఎన్నో డైమెన్షన్ ఉంటాయని.. అందరూ హ్యాపీగా ఉండాలని.. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకున్నానని అన్నారు. అఖిల్, అవినాష్, సోహెల్, మెహబూబు లు మాట్లాడుతూ భావోద్వేగాలకు గురయ్యారు.

వీరితో పాటు లాస్య, హారిక, అరియానా గ్లోరీ, జోర్దార్ సుజాత లు మాట్లాడుతూ.. ఈ పార్టీలో కలిసినందుకు వాళ్ళను పార్టీకి ఆహ్వానించినందుకు, ఇంకా తమ జీవితంలో బిఫోర్ బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్ విశేషాలు చెప్తూ.. మెగా ఫ్యామిలీ తమకు ఎంతో ఆనందాన్ని.. అవకాశాల్ని ఇచ్చినందుకు ఆనందంగా ఉందని ఎమెషనల్ అయ్యారు. ఈ పార్టీలో యాంకర్ రవి, జీ తెలుగులో ప్రసారమయ్యే అదిరింది టీమ్ కూడా ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేశారు.