Mega Star: మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో యువ హీరోలతో సమానంగా ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి తీసిన ఆచార్య విడుదలకు సిద్ధంగా ఉంది.మరోవైపు వేదాళమ్ రీమేక్ భోళా శంకర్, లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ సెట్స్ పై ఉన్నాయి. ఇవి కాకుండా మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో 154వ చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా,మైత్రి మూవీ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా శృతిహాసన్ నటిస్తున్నారు.
అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటన సంబంధించి వార్తలు వినిపిస్తున్నాయి.. సాధారణంగానే బాబీకి కాస్త సిగ్గు, మొహమాటం ఎక్కువ.ఓ సన్నివేశం తీసి.. దానికి వన్‌మోర్ చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడట ఈ యంగ్ డైరెక్టర్.చిరంజీవికి పెద్ద ఫ్యాన్ అయిన బాబీ షాట్‌లో ఉన్నప్పుడు చిరంజీవితో మరో టేక్ కోసం వన్‌మోర్ చెప్తే ఆయన ఏమనుకుంటారో అనే భయం ఉంటుందట బాబీకి.
ఈ విషయాన్ని గమనించిన చిరంజీవి.. బాబీని దగ్గరికి పిలిచి ‘నువ్వేం మొహమాట పడకు, ఎన్ని టైకులైన అడుగు.. దర్శకుడిగా అది నీ హక్కు’ అని ధైర్యం చెప్పారట చిరంజీవి.పెద్ద హీరోను డైరెక్ట్ చేయాలంటే యంగ్ డైరెక్టర్స్‌కు కొంచెం కష్టమైన పనే. వారి స్టార్‌డమ్, క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ వంటి అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని వారిని డైరెక్ట్ చేయాల్సి ఉంటుంది.వీటన్నింటిని అధిగమించి అగ్ర హీరోలతో టేక్స్ తీసుకోవడం అంతా ఆషామాషీ విషయం ఏమి కాదు