Anil Ravipudi : బాలయ్య అభిమానులు కోరినట్లే సినిమా కథ…కానీ నా మార్కు హాస్యం జోడిస్తా అంటున్న అనిల్…!

Anil Ravipudi : అఖండ సినిమా తో ఫుల్ జోష్ మీద ఉన్న బాలయ్య తన నెక్స్ట్ సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వం లో తీయబోతున్నారనే సంగతి అందరికి తెలుసు. ఆ తర్వాత అనిల్ రావిపూడితో చేయనున్నారు ఇక ఈ సినిమా కథ వినకుండా బాలకృష్ణ ఓకే చెప్పాడని అందరు ఆశ్చర్య పోయారు. ఇక ఇప్పుడు బాలయ్యతో సినిమా కథ ఏంటో అన్న చర్చ అభిమానుల్లో మొదలైంది. అనిల్ రావిపూడి అంటేనే తన మార్కు కామెడీ సినిమా లో ఉంటుంది. అలాంటిది మాస్ సినిమాలు తీసే బాలయ్యతో ఇలాంటి సినిమా ఉంటుందో అని అభిమానుల్లో ఆసక్తి మొదలైంది.

అనిల్ రావిపూడి అనగానే తన మార్కు టైమింగ్ తో సినిమా మొత్తం నవ్వులు ఉండేలా సినిమాని ప్లాన్ చేస్తారు. పటాస్ తో మొదలుకొని నేటి సరిలేరు నీకెవ్వరు వరకు కథతోపాటు తన మార్క్ కామెడీని ఎక్కడా మిస్ చేయలేదు అనిల్ రావిపూడి. ప్రస్తుతం అనిల్ రావిపూడి f2 కొనసాగింపుగా వస్తున్న f3 షూటింగ్ లో బిజీగా ఉన్నారు.దీని తర్వాత బాలయ్య కాంబినేషన్లో సినిమా ఉండబోతోంది.తాజాగా అనిల్ మాట్లాడుతూ బాలకృష్ణగారి ఇమేజ్ కి భిన్నంగా వెళ్లకుండా, ఒక డిఫరెంట్ జోనర్లో ఈ కథను నడిపించాలని అనుకుంటున్నాను అని అన్నారు. అలాగే బాలకృష్ణ గారిని ఎలా చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడతారో, అలా చూపించాలనే ఉద్దేశంతోనే ఉన్నాను. నా మార్కు ఎంటర్ టైన్ మెంట్ ను ఎలాగు జత చేస్తాను అని అనిల్ చెప్పుకొచ్చారు.

నిన్నమొన్నటి వరకు మీడియం రేంజ్ హీరోలను హ్యాండిల్ చేసిన అనిల్ రావిపూడి ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేసి సరిలేరు నీకెవ్వరు చేసి టాప్ డైరెక్టర్స్ జాబితా లోకి వెళ్ళిపోయాడు.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అనిల్ తన కెరీర్ లో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు . ప్రస్తుతం ఎఫ్ 3 సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్న అనిల్. గతంలో వెంకటేష్ వరుణ్ తేజ్ తో కలిసి ఎఫ్ 2 అంటూ సందడి చేశాడు. పెళ్ళాం పోరు భరించలేని భర్తలు అంటూ నవ్వులు పూయించాడు. ఇప్పుడు దానికి సీక్వెల్ గా ఎఫ్ 3 సినిమాలో సునీల్ సోనాల్ చౌహన్ ఇద్దరు కొత్తగా యాడ్ అయ్యారు. ఎఫ్ 2 కు మించి నవ్వులు పూయించే గ్యారెంటీ నాది అని ఇప్పటికే ప్రేక్షకులకు హామీ ఇచ్చిన అనిల్ ఇపుడు అదే పనిలో బిజీగా ఉన్నాడు.