‘భోళా శంకర్’ కోసం మెంటల్ గా ప్రిపేర్ అయిపోతున్న మెగా ఫ్యాన్స్.!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “భోళా శంకర్” కోసం అందరికీ తెలిసిందే. కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తుండగా ఇన్ని రోజులు అయితే ఈ చిత్రంపై పర్వాలేదు అనిపించే బజ్ ఉంది.

మాస్ అండ్ స్ట్రైట్ సినిమా “వాల్తేరు వీరయ్య” హిట్ తో అయితే మెగాస్టార్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చినా దాని హిట్ మ్యానియాతో భోళా శంకర్ కూడా మాస్ సినిమా కాబట్టి కొద్దిగా హైప్ పెరిగింది. అయితే టీజర్ వరకు కూడా బాగానే ఉంది కానీ సినిమా నుంచి ఒక్కో సాంగ్ సినిమా నుంచి నిన్న వచ్చిన ట్రైలర్ తో ఐతే ఫ్యాన్స్ అయోమయంలో పడిపోయారు.

ఈ ట్రైలర్ చూసాక సినిమా హిట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువే ఉండేలా అనిపిస్తున్నాయని ఫ్యాన్స్ నే అంటున్నారు. కొందరు అయితే ఎలా ఉన్నా బాగానే ఉంది అంటారు కానీ కొందరు రియల్ మెగా ఫ్యాన్స్ మాత్రం చిరు తీసుకుంటున్న ఈ స్టెప్స్ ని తీసుకోలేకపోతున్నారు. ఇప్పటి నుంచే భోళా శంకర్ రిలీజ్ కి మెంటల్ గా తమని తాము ప్రిపేర్ చేసుకుంటున్నారు. ట్రైలర్ అయితే సినిమాకి బాగా దెబ్బేసింది అని చెప్పొచ్చు.

మరీ బాగుంది అని చెప్పలేం బాగోలేదు అని చెప్పలేని విధంగా అయితే సినిమా ఉండేలా ఉంది. కాగా ఈ చిత్రం రీమేక్ కాబట్టి కంటెంట్ పరంగా యావరేజ్ గా ఉంటుందో ఏమో అని ఎక్కడో కొందరు అనుకుంటున్నారు. వీటితో అయితే ఈ సినిమాపై ఫ్యాన్స్ మాత్రం పెద్దగా అంచనాలు ఏమీ పెట్టుకోవడం లేదు.