అజ్ఞాతవాసంలో మెగా డాటర్ … నిహారిక సైలెన్స్ వెనుక కారణం ఏమిటి..?

మెగా బ్రదర్ నాగబాబు కూతురుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మెగా డాటర్ నిహారిక గురించి తెలియని వారంటూ ఉండరు. ఎవరు ఊహించని విధంగా మెగా కుటుంబం నుండి హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి అందరికీ షాక్ ఇచ్చిన నిహారిక హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది. హీరోయిన్గా నిహారిక నటించిన మూడు సినిమాలు ప్లాప్ అవ్వటంతో ఆమె సినిమాలకు పూర్తిగా దూరమైంది. ఆ తర్వాత వివాహం చేసుకొని భర్త సహకారంతో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లకు నిర్మాతగా వ్యవహరిస్తూ బిజీగా ఉంది. ఇలా నిర్మాతగా మారిన నిహారిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండేది.

అయితే గతంలో రాడిసన్ పబ్ ఇష్యూ వల్ల నిహారిక కొంతకాలం సోషల్ మీడియాకు దూరం అయింది. ఆ వివాదం తర్వాత నిహారిక భర్త ఆమెకు విడాకులు ఇవ్వనున్నాడని వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలను కొట్టి పారేస్తూ నిహారిక తన భర్తతో కలిసి విదేశాలలో వెకేషన్ ఎంజాయ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇలా అప్పటినుండి మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన నిహారిక తన వృత్తిపరమైన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకునేది. అయితే మరొకసారి నిహారిక సోషల్ మీడియాలో కనిపించటం లేదు.

ఇలా ఉన్నపలంగా నేహారిక సోషల్ మీడియాకు దూరం అవటంతో అభిమానుల్లో అనేక అనుమానాలు మొదలయ్యాయి. గతంలో పబ్ ఇష్యూ వల్ల సోషల్ మీడియాకు దూరం అయింది. అయితే ఇప్పుడు కూడా ఇలా సోషల్ మీడియాకు దూరం కావటంతో మరొకసారి నిహారిక ఇలాంటి వివాదాల్లో చిక్కుకుందా? లేక మరేదైనా కుటుంబ సమస్యల కారణంగా ఆమె సోషల్ మీడియాకు దూరంగా ఉందా ? అని అనుమానాలు రేక్కెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా చాలాకాలంగా విడాకుల వార్తలు వినిపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో నిహారిక కనిపించకపోవడం తో ఈ విడాకుల వార్తలు మళ్లీ తెరపైకి వచ్చాయి. నిహారిక తన భర్తకు విడాకులు ఇవ్వనుందని, అందుకే ఆ విషయాలు బయటికి రాకుండా మీడియా కి దూరంగా ఉందని తెలుస్తోంది. ఇక వార్తల గురించి క్లారిటీ రావాలంటే నిహారిక స్పందించాల్సి ఉంటుంది.