ప్ర‌భాస్ గొప్ప మ‌నస్సు.. దర్శకుడి రుణం తీర్చుకోవడం కోసం ఏ హీరో చేయని సాయం

గతంలో ఎప్పుడో మనకు మేలు జరిగింది కదా.. దాని గురించి ఇప్పుడెందుకులే అనుకునేవారు కొంతమంది. గతంలో జరిగిన సంఘటనలే మన జీవితాయనే మార్చయనుకునేవారు ఇంకొంతమంది. అయితే చాలామంది చేసిన సాయం.. నిలబెట్టాలనుకున్న ఆశయాన్ని మర్చిపోతుంటారు. అలా ఉంటే మనిషి అనే మాటకు అర్థమే ఉండదు. అందుకే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎప్పుడో తనకు చేసిన సాయాన్ని గుర్తు పెట్టుకుని.. మరీ ఇప్పుడు సహాయం చేస్తున్నారు. 2004 లో విడుదలై సంచలనం సృష్టించిన వర్షం సినిమాతో ప్రభాస్ దశ తిరిగింది.

ఈ సినిమా తర్వాత ప్రభాస్ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రభాస్ రేంజ్ ని డిమాండ్ చేసేలా చేసింది. ఇదిలా ఉండగా ఇలాంటి బ్లాక్ బస్టర్ సినిమాని ప్రభాస్ కి ఇచ్చిన శోభన్ కుమారుడు సంతోష్ హీరోగా మారడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. శోభన్ చనిపోయిన తర్వాత.. ఆయన కొడుకు కెరీర్ లో ఎదగలేదు. ఇఫ్పుడు ప్రభాస్, దర్శకుడు చేసిన మేలును గుర్తుంచుకుని సంతోష్ ను హీరోగా మార్చడానికి తన వంతు సాయం చేస్తున్నారు. ఇప్పటికే తాను – నేను, పేపర్ బాయ్ సినిమాల్లో హీరోగా నటించిన సంతోష్ కి విజయం అనుకున్న స్థాయిలో దక్కలేదు. అయితే నటుడిగా మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

ప్రభాస్ కూడా సంతోష్ శోభన్ కోసం సినిమా ప్రమోషన్ లో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడట. ఇలాగైనా శోభన్ తీర్చుకోవచ్చని ప్రభాస్ అనుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఈ సినిమా కోసం మోడల్ కమ్ హీరోయిన్ కావ్యను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాను ఇదే ఏడాదిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు, రెగ్యూలర్ షూటింగ్ త్వరలోనే పూర్తి కానున్నట్లు సమాచారం. మరి ప్రభాస్ అండగా నిలబడి సంతోష్ శోభన్ ని హీరోగా నిలబెట్టాలన్న ఆశయం సక్సెస్ అవుతుందో లేదో తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే.