క్రేజీ ఆఫర్ కొట‌్టేసిన ఇస్మార్ట్ హీరోయిన్… పవన్ తో రచ్చ మామూలుగా ఉండదంటున్న నిధి

పవన్ కళ్యాణ్ హీరోగా, డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ సినిమా కోసం పలువురు భామల పేర్లు స్క్రీన్ పైకి వచ్చాయి. లేటెస్ట్ గా ఈ సినిమా సమాచారం మేరకు ఇద్దరు హీరోయిన్లకు ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒక హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ని నిర్ణయించారు. అలాగే మరో పాత్ర కోసం ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ నిధి అగర్వాల్ ను ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రాజెక్ట్ లో నిధి సైన్ చేసినట్లు కూడా తెలుస్తుంది. దీంతో పవన్ కళ్యాణ్ సినిమాలో నిధి అగర్వాల్ ఛాన్స్ కొట్టేసిందంటూ టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు పవన్ అభిమానులు కూడా సంబరపడుతున్నారు.

Pana | Telugu Rajyam
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా పూర్తి చేసుకున్నారు. దీంతో పాటు అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ తర్వాత క్రిష్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ లో అతి త్వరలోనే హీరోయిన్స్ జాక్వెలిన్, నిధి అగర్వాల్ సెట్స్ కి వస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాని భారీ అంచనాలతో.. బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. కోహినూర్ వజ్రం కథ నేపథ్యంతో ఈ సినిమా ఉంటుందని.. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బంధిపోటుగా కనిపిస్తారని ఫిల్మ్ టీమ్ తెలిపింది.

ఇక నిధి అగర్వాల్ కూడా పలు బిజీ షెడ్యూల్ తో ఉంది. మజ్ను సినిమాతో టాలీవుడ్ లోకి ఎంటర్ అయిన ఈ బ్యూటీ ఇప్పటికే పలు సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో నిధికి మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత కూడా సరైన సినిమా అవకాశాలు రాకపోయినప్పటికీ కోలీవుడ్ లో సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాపైనే ఆమె ఆశలు పెట్టుకుంటున్నట్లు తెలుస్తుంది.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles