మెగాస్టార్ కి మే నెల కలిసివస్తుందా.. 28 ఏళ్ళ తర్వాత మే నెలలో ఆచార్య రిలీజ్‌!

మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరే ఓ ట్రెండ్ సెట్టర్.. ఎలాంటి సినీ బ్యాక్ డ్రాప్ లేకుండా స్వయం కృషితో ఎదిగి.. కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న ఓ స్టార్. అలాంటి వ్యక్తి నుండి సినిమా వస్తుందంటేనే అభిమానులకు పండుగ. అలాంటి ఓ భారీ ప్రతిష్టాత్మక సినిమా ఆచార్య. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఏ చిన్న పాటి అప్డేట్ వస్తుందా అని ఆత్రుతగా ఉన్నారు. ఈ సినిమాని మే 13 వ తేదీన ఆచార్యగా.. గుణపాఠాలు నేర్పించే గురువుగా ప్రత్యక్షం కాబోతున్నారు. ఈ వేసవి కానుకగా సినిమాను రీలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. ప్రస్తుతం ఈ రిలీజ్ డేట్ మెగా ఫ్యాన్స్ లో ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది.

మే నెల చిరంజీవి సినిమాలకు బాగా కలిసివచ్చిందంటూ.. చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచిన జగదేక వీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్ లాంటి సినిమాలు మే నెలలోనే విడుదలయ్యాయి. అలాగే ఇప్పుడు ఆచార్య సినిమా రిలీజ్ డేట్ కూడా మే నెలలో ఉంది. చిరంజీవి 86 వ సినిమా వేట. ఈ సినిమాని కూడా మే నెలలోనే విడుదలైంది. దీంతో పాటు మరికొన్ని సినిమాలు కూడా మే నెలలో విడుదలైనా ఆశించిన స్థాయిలో విజయం దక్కలేదు. ఆ తర్వాత 1993 లో రిలీజైన మెకానిక్ అల్లుడు సినిమా కూడా మే నెలలోనే విడుదలైంది.

ఈ సినిమా తర్వాత దాదాపు 28 సంవత్సరాల తర్వాత ఆచార్య ను మే నెలలోనే రిలీజ్ చేయడం విశేషమనేది ప్రేక్షకుల అభిప్రాయం. ఆచార్యకు డేట్, టైమ్ తో పాటు ఆరోజున వచ్చే నక్షత్రం కూడా బావుందంటూ.. అది చిరుకి బాగా కలిసివస్తుందనే అంచనాలు పెరిగాయి. దీంతో ఆచార్య సినిమా బాక్సాఫీస్ దగ్గర దద్దరిల్లుతుందనేది మెగా అభిమానుల నమ్మకం.