ప్రముఖ సౌత్ ఇండియన్ సీనియర్ హీరోయిన్ మీనా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ్, మలయాళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన మీనా స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. ఒకప్పుడు హీరోయిన్ గా ఎన్నో సినిమాలలో నటించిన మీనా ఇప్పటికీ ప్రధాన పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణంతో మీనా కుటుంబంతో పాటు ఇండస్ట్రీలో కూడా విషాదఛాయలు అలుముకున్నాయి.
హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్నప్పుడే మీనా విద్యాసాగర్ ని వివాహం చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది. ఆ తర్వాత కూతురు పుట్టటంతో చాలాకాలం సినిమాలకు దూరంగా ఉన్న మీనా తర్వాత భర్త ప్రోత్సాహంతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన విద్యాసాగర్ చాలా సంవత్సరాలుగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నాడు. అయితే ఇటీవల మీనా కుటుంబం మొత్తం కరోనా బారిన పడింది .ఈ క్రమంలో విద్యాసాగర్ కూడా కరోనా నుండి కోలుకున్నప్పటికీ ఊపిరితిత్తుల పనితీరు మందగించడంతో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నాడు. ఈ క్రమంలో ఊపిరితిత్తుల ట్రాన్స్ఫర్మేషన్ చేయాలని డాక్టర్లు ప్రయత్నించగా ఊపిరితిత్తుల దానం చేసేవారు దొరకక విద్యాసాగర్ ప్రాణాలు కోల్పోయాడు. భర్త మరణంతో మీనా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
ఇప్పుడిప్పుడే మీనా ఆ బాధనుండి బయటపడటానికి షూటింగులలో పాల్గొంటుంది. ఇదిలా ఉండగా తన భర్త ఊపిరితిత్తులు దానం చేసేవారు దొరక్కపోవటంతో మరణించాడు. తన భర్త లాగా ఎవరు అలా మరణించకూడదని భావించి వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే రోజున మీనా తన అవయవాలను దానం చేయటానికి అంగీకరించింది. ఈ క్రమంలో వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే రోజున మీనా తన అవయవాలను దానం చేసినట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ప్రాణాలను కాపాడటం కంటే మరొక గొప్ప పని ఉండదు అందువల్ల నా మరణానంతరం నా అవయవాలను నేను దానం చేస్తున్నాను అంటూ రాసుకొచ్చింది. మీనా శేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీనా చేసిన గొప్ప పనికి అందరూ అమెను అభినందిస్తున్నారు.