అమెజాన్‌లోకి మస్తు షేడ్స్‌ ఉన్నాయ్‌ రా..!

’టాలీవుడ్‌ ప్రముఖ కమెడియన్‌ అభినవ్‌ గోమఠం గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ‘మళ్లీరావా’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ‘ఈ నగరానికి ఏమైంది’, ‘విూకు మాత్రమే చెప్తా’, ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక ఈ సినిమాలు ఇచ్చిన జోష్‌తో ప్రస్తుతం వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు. అయితే అభినవ్‌ గోమఠం తాజాగా నటించిన కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘మస్తు షేడ్స్‌ ఉన్నాయ్‌ రా..!’ ఈ సినిమాకు తిరుపతి రావు దర్శకత్వం వహించగా.. వైశాలి రాజ్‌, లావణ్య రెడ్డి కథనాయికలుగా నటించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 23న విడుదలై మంచి విజయం అందుకుంది.

అయితే ఈ సినిమా తాజాగా ఓటీటీ లాక్‌ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా మార్చి 29 నుంచి ఇది స్టీమ్రింగ్‌ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్‌ సోషల్‌ విూడియా వేదికగా ప్రకటించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. గోదావరి ప్రాంతంలో ఉన్న ఒక చిన్న పల్లెటూళ్లో మనోహర్‌ (అభినవ్‌ గోమఠం) అనే వ్యక్తి గొప్ప పెయింటర్‌ అవ్వాలని.. అలాగే తన ఊరిలోనే దానిపై మంచి బిజినెస్‌ పెట్టి లైఫ్‌ లో సెటిల్‌ అవుదామని కలలు గంటూ ఉంటాడు.

ఈ క్రమంలో పరిచయమైన ఉమాదేవి తనకి ఎలా సహాయపడింది. మధ్యలో వీళ్ళ లవ్‌ ట్రాక్‌ ఏంటి? అసలు మనోహర్‌కు తాను కలలు గన్న జీవితం దొరుకుతుందా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. కాసుల క్రియేటివ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై వంశీ నందిపాటి సమర్పణలో ఆరేం రెడ్డి, ప్రశాంత్‌, భవాని కాసుల ఈ సినిమాను నిర్మించారు.