Raj Tarun – Lavanya: రాజ్ తరుణ్ – లావణ్య కేసు: హత్యకు ప్లాన్ చేసిన మస్తాన్‌సాయి

రాజ్ తరుణ్-లావణ్య కేసులో నిందితుడు మస్తాన్‌సాయి రిమాండ్ రిపోర్టు వెలుగులోకి వచ్చింది. ఇందులో అతడిపై తీవ్రమైన ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. లావణ్యను హత్య చేసేందుకు అతడు పథకం పన్నినట్లు స్పష్టమైన ఆధారాలు లభించినట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా, యువతుల ప్రైవేట్ వీడియోలను సేకరించి బెదిరింపులకు పాల్పడినట్లు కూడా రిపోర్టులో పేర్కొన్నారు. ఈ కేసులో మస్తాన్‌సాయిపై ఎన్డీపీఎస్ సెక్షన్‌ను కూడా పోలీసులు చేర్చారు.

రిమాండ్ రిపోర్టు ప్రకారం, మస్తాన్‌సాయి, అతడి స్నేహితుడు ఖాజా డ్రగ్స్ సేవించినట్లు పరీక్షల్లో నిర్ధారణ అయింది. మత్తులో ఉన్న మస్తాన్‌సాయి లావణ్య ఇంటికి వెళ్లి గొడవ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ముఖ్యంగా, గత నెల 30న లావణ్య ఇంట్లోకి ప్రవేశించి ఆమెను హత్య చేసేందుకు ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో అతడిపై హత్యాయత్నం, బెదిరింపు ఆరోపణలు తీవ్రంగా ముదిరాయి.

Lavanya – Raj Tarun: లావణ్య – రాజ్ తరుణ్ కేసు.. మస్తాన్ సాయి అరెస్టుతో మరిన్ని లీకులు..

మస్తాన్‌సాయి లాప్‌టాప్‌లో లావణ్యకు సంబంధించిన వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వీడియోలను తొలగించేందుకు రాజ్ తరుణ్ గతంలో ప్రయత్నించినా, అప్పటికే మస్తాన్‌సాయి వాటిని ఇతర డివైజ్‌లలోకి కాపీ చేసుకున్నట్లు రిమాండ్ రిపోర్టు స్పష్టం చేసింది. ఈ వీడియోల ఆధారంగా లావణ్యను బెదిరించేందుకు అతడు ప్రయత్నించాడని అనుమానిస్తున్నారు.

హార్డ్ డిస్క్ కోసం లావణ్యను హత్య చేయడానికి పథకం వేసినట్లు పోలీసులు వెల్లడించడంతో, ఈ కేసు మరింత సీరియస్ గా మారింది. ప్రస్తుతం మస్తాన్‌సాయి పోలీసుల కస్టడీలో ఉండగా, మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. ఈ కేసు టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

లావణ్య ఎఫైర్లు || Social Activst Krishna Kumari About Masthan Sai Arrest | Lavanya | Raj Tarun | TR