Lavanya – Raj Tarun: లావణ్య – రాజ్ తరుణ్ కేసు.. మస్తాన్ సాయి అరెస్టుతో మరిన్ని లీకులు..

టాలీవుడ్‌లో ఇటీవల హాట్ టాపిక్‌గా మారిన రాజ్ తరుణ్ – లావణ్య కేసులో మస్తాన్ సాయి అరెస్టు కొత్త మలుపు తిరిగించింది. సోమవారం నార్సింగ్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. లావణ్య ఫిర్యాదు మేరకు అతని నివాసం, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 200కి పైగా వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. ఈ వీడియోల వ్యవహారం ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారి తీసింది.

ఈ హార్డ్ డిస్క్‌లో టాలీవుడ్‌కు చెందిన కొంతమంది ప్రముఖుల వీడియోలు ఉన్నాయన్న వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. మస్తాన్ సాయిపై లావణ్య చేసిన ఆరోపణలు మరింత తీవ్రంగా మారాయి. లావణ్య తెలిపిన వివరాల ప్రకారం, అతడు ఆమెపై లైంగిక దాడి జరిపి, ఆ వీడియోలను బ్లాక్‌మెయిల్ కోసం ఉపయోగించాడని ఆరోపిస్తోంది. అంతేకాదు, మరికొందరు యువతులను మత్తు పదార్థాలకు బానిసలుగా మార్చి, వారి ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేసి బెదిరించాడన్న కథనాలు వినిపిస్తున్నాయి.

విచారణలో మస్తాన్ సాయి తనపై వచ్చిన ఆరోపణలను ఖండించాడు. “ఈ వీడియోలన్నీ నన్ను చిక్కులో పెట్టేందుకు లావణ్య పన్నిన కుట్ర. వాటిలో ఉన్నవారు నా భార్య, గర్ల్‌ఫ్రెండ్. వారు పూర్తిగా సమ్మతితోనే పాల్గొన్నారు” అని పోలీసులకు వివరణ ఇచ్చాడు. అయితే, అతని హార్డ్ డిస్క్‌లో మరిన్ని వ్యక్తిగత వీడియోలు ఉన్నాయన్న అనుమానాలు బలపడుతున్నాయి.

ఈ కేసు బయటపడిన వెంటనే, రాజ్ తరుణ్ – లావణ్య వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో లావణ్య తన జీవితాన్ని నాశనం చేసాడని రాజ్ తరుణ్‌పై కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు మస్తాన్ సాయి అరెస్టుతో పాటు, లావణ్య చేసిన ఆరోపణలు మరింత సంచలనంగా మారుతున్నాయి. పోలీసులు ఫోన్లు, హార్డ్ డిస్క్‌ను విచారిస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్లనుందనేది ఉత్కంఠ రేపుతోంది.

Assembly లో రేవంత్ రెడ్డి కి చమటలు పట్టించిన KTR || KTR Fires On Revanth Reddy In Assembly || TR