మాసివ్ అప్డేట్ : క్రేజీ లుక్ లో రామ్..బోయపాటి టీజర్ వచ్చేస్తోంది.!

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి ఉన్న పలు మాస్ క్రేజీ ప్రాజెక్ట్ లలో దర్శకుడు బోయపాటి శ్రీను మరియు యంగ్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా చేస్తున్న సాలిడ్ పాన్ ఇండియా సబ్జెక్టు చిత్రం కూడా ఒకటి. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా ఈ సినిమాలో యంగ్ సెన్సేషన్ శ్రీ లీల అయితే హీరోయిన్ గా నటిస్తుంది.

కాగా ఈ చిత్రాన్ని అయితే ఇప్పుడు శరవేగంగా తెరకెక్కిస్తుండగా ఈ మే 15న రామ్ పుట్టినరోజు కానుకగా మాసివ్ అప్డేట్ ఇస్తున్నట్టుగా ఇప్పటికే టాక్ ఉంది. కాగా ఈ సినిమా నుంచి ఇప్పుడు ఈ మాసివ్ అప్డేట్ ని ఒక ఊహించని లుక్ పోస్టర్ తో అయితే రివీల్ చేశారు.

మొదటగా ఈ పోస్టర్ కోసం మాట్లాడితే రామ ఇది వరకు చేసిన రెడ్, ఇస్మార్ట్ శంకర్ లో లుక్స్ నే మాస్ అనుకుంటే బోయపాటి మాత్రం డబుల్ మాస్ లో చూపిస్తున్నాడని అర్ధం అవుతుంది. ఇక ఈ పోస్టర్ తో ఫస్ట్ థండర్ అంటూ సినిమా టీజర్ కి అయితే మేకర్స్ డేట్ అండ్ టైం లాక్ చేసేసారు.

ఈ 15 నే ఉదయం 11 గంటల 25 నిమిషాలకి ఈ సినిమా టీజర్ ని అయితే లాంచ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ఇప్పుడు కన్ఫర్మ్ చేశారు. మరి ఈ సెన్సేషనల్ కాంబో కోసం అయితే ఫ్యాన్స్ చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఈ అక్టోబర్ 20 వరకు ఆగాల్సిందే.