అందులో పాన్ ఇండియా భాషల్లో “స్కంద” ఓటిటి డెబ్యూ..! 

ఈ ఏడాది టాలీవుడ్ నుంచి వచ్చిన మిడ్ రేంజ్ హీరోస్ చిత్రాల్లో ఉస్తాద్ రామ్ పోతినేని మరియు దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ప్లాన్ చేసిన సెన్సేషనల్ మాస్ పాన్ ఇండియా చిత్రం “స్కంద” కూడా ఒకటి. కాగా ఈ చిత్రం అయితే అనుకున్న రేంజ్ సక్సెస్ అని అందుకోలేదు కానీ మాస్ ఆడియెన్స్ ని బాగానే ఇంప్రెస్ చేసింది.

దీనితో స్వల్ప నష్టాలతో బయటపడిన ఈ చిత్రం మాస్ కి బాగానే ఎక్కింది. ఇక థియేటర్స్ రిలీజ్ తర్వాత అయితే ఓటిటి లో ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూస్తున్న వారికి ఇప్పుడు గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. కాగా ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి లో వచ్చేసింది.

మరి ఈ సినిమాని హాట్ స్టార్ వాళ్ళు సొంతం చేసుకోగా అందులో ఈ చిత్రం ఈ నవంబర్ 2 నుంచి అయితే పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. దీనితో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న వారికి సాలిడ్ న్యూస్ ఇది అని చెప్పాలి. మరి ఈ చిత్రం పాన్ ఇండియా థియేట్రికల్ రిలీజ్ అయితే సక్సెస్ కాలేదు.

మరి ఇప్పుడు ఓటిటి లో అయినా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. ఇక ఈ చిత్రంలో శ్రీలీల మరియు సాయి మంజ్రేకర్ లు హీరోయిన్స్ గా నటించగా థమన్ సంగీతం అందించాడు. కానీ తన సంగీతం విషయంలో బోయపాటి చేసిన రచ్చ కూడా అందరికీ తెలిసిందే.