రీసెంట్ గా టాలీవుడ్ లో రిలీజ్ అయ్యిన కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ కాంబినేషన్స్ లో అయితే దర్శకుడు బోయపాటి శ్రీను మరియు హీరో రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన పక్కా మాస్ చిత్రం “స్కంద” అని చెప్పాలి. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబట్టింది కానీ.
పూర్తి స్థాయి లాభాల్లోకి అయితే వెళ్ళలేదు. కాగా మొన్ననే ఈ చిత్రం ఓటిటి లోకి రిలీజ్ కాగా ఈ సినిమాపై దారుణమైన ట్రోల్స్ పడ్డాయి. వాటిలో అయితే సినిమా క్లైమాక్స్ ఫైట్ లో రామ్ కి డూప్ కి ఏకంగా దర్శకుడు బోయపాటి శ్రీను ఒక సీన్ చేయడం ఇంకా ఎక్కువ వైరల్ అయ్యింది.
దీనితో రామ్ కి స్టంట్ డబుల్ గా బోయపాటి చేసాడు అంటూ అటు రామ్ ని అలాగే దర్శకుడు బోయపాటి శ్రీనుపై కూడా చాలా మంది ట్రోల్స్ చేశారు. కానీ అసలు అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తన స్థానంలో బోయపాటి ఎందుకు చేయాల్సి వచ్చిందో రామ్ ఓ చేదు నిజాన్ని తెలిపాడు.
ఆరోజు 2023 ఏప్రిల్ 22వ తారీఖు నేను ఆ డేట్ అసలు మర్చిపోలేను ఆరోజు చాలా తీవ్ర ఎండలో మేము ఓ సీన్ చేయాల్సి వచ్చింది. అప్పటికీ చాలా రోజులు ఎండలోనే షూటింగ్ చేసాము. ఆ టైం లో నా కాలికి దెబ్బ తగిలి బ్లీడింగ్ కూడా అయ్యింది. మా డైరెక్టర్ మాత్రం షాట్ ఎలా అయినా కంప్లీట్ చేయాలి అన్నారు కానీ నేను కనీసం నిలబడలేకపోయేవాడిని మంచో చెడో ఆ షాట్ ని మా దర్శకుడు కంప్లీట్ చేశారు.
ఇప్పుడు అది ఎలా వెళ్లినా ఆడియెన్స్ ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చినా అది మీ ఛాయిస్. కానీ ఆ ఒక్క షాట్ విషయంలో మాత్రం నా దర్శకునికి థాంక్స్ చెప్పుకుంటాను. అలాగే మీ నుంచి ఏమీ ఆశించకుండా నా పనికి మాత్రం నా చెమట రక్షతంరక్తం దారబోస్తాను మీ రామ్ పోతినేని అంటూ రామ్ ఆ సీన్ వెనుక ఉన్న అసలు నిజాన్ని రివీల్ చేసాడు.
22.04.23 I still remember..it was one of the hottest days during the peak of summer..this was my feet after filming this episode on the 3rd day of the 25days..couldn’t walk properly..went away for a bit after it started to bleed..so My Director wanted to get the shot right n did… https://t.co/8cSOTW2H7b pic.twitter.com/4DXF0DYDFn
— RAm POthineni (@ramsayz) November 4, 2023