మాస్ మహారాజ్ “ఈగల్” టీజర్…

టాలీవుడ్ సీనియర్ మాస్ హీరోస్ లో ఒకడైన ఎనర్జీ డైనమైట్ మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన రీసెంట్ చిత్రమే “టైగర్ నాగేశ్వరరావు”. ఈ చిత్రం తన కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ చిత్రం అయినప్పటికీ ఆ రేంజ్ వసూళ్ళని అందుకోలేదు కానీ పర్వాలేదు అనిపించింది. ఇక ఈ సినిమా తర్వాత రవితేజ చేస్తున్న మరో భారీ చిత్రమే “ఈగల్”.

దీనిని కూడా కొత్త దర్శకుడు కార్తీక్ ఘట్టమననేని తెరకెక్కిస్తుండగా ఓ భారీ ఏక్షన్ డ్రామాగా అయితే ఇది రాబోతుంది. ఇక ఆల్రెడీ సంక్రాతి రేస్ లో ఫిక్స్ చేసిన ఈ భారీ చిత్రంపై మేకర్స్ ఇప్పుడు మంచి అప్డేట్ అందించారు. ఈ చిత్రం నుంచి ఐతే టీజర్ అతి త్వరలోనే రాబోతుండగా.

దీనిపై క్లారిటీ మాత్రం రేపు నవంబర్ 5న రివీల్ చేస్తున్నట్టుగా తెలిపారు. టైం ఇంకా రివీల్ చేయలేదు కానీ రేపు మాత్రం ఈ టీజర్ పై అప్డేట్ ఉన్నట్టుగా ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో తెలిపారు. మరి ఈ టీజర్ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇంకా ఈ చిత్రంలో రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్ మరియు కావ్య థాపర్ లు నటిస్తుండగా దేవ్ జాండ్ సంగీతం అందిస్తున్నాడు.

అలాగే ఇప్పటికే రవితేజ బిగ్ హిట్ స్కోర్ చేసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు అయితే ఈ చిత్రంని నిర్మాణం వహించగా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఎట్టి పరిస్థితిలో రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. దీనితో ఈ సినిమా జనవరి 13న విడుదల కాబోతుంది.