భూమా మౌనిక మొదటి వివాహానికి అతిథిగా వెళ్ళిన మనోజ్… వైరల్ అవుతున్న ఫోటో!

మంచు మనోజ్ గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియా వార్తలను నిలుస్తున్నారు ఈయన ప్రముఖ రాజకీయ నాయకుడు కుమార్తె భూమా మౌనికను రెండవ వివాహం చేసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే వీరిద్దరు కలిసి పూజా కార్యక్రమాలలో పాల్గొనడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇదిలా ఉండగా తాజాగా భూమా మౌనికకు సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతుంది. భూమా మౌనికకు ఇదిమొదటి వివాహం కాదని ఆమెకు ఇదివరకే వివాహం జరిగి ఐదు సంవత్సరాలు కుమారుడు కూడా ఉన్నారని తెలుస్తోంది.ఇక్కడ మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే భూమా మౌనిక 2015 వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. అయితే ఈమె వివాహానికి మంచు మనోజ్ అతిథిగా వెళ్లడం విశేషం. ఇలా మౌనిక మొదటి వివాహానికి అతిథిగా హాజరైన మంచు మనోజ్ తిరిగి ఆమెని రెండో పెళ్లి చేసుకోవడం ఏంటి విడ్డూరంగా అంటూ పలువురు భావిస్తున్నారు.

మొత్తానికి ఈయన భూమా మౌనికను వివాహం చేసుకోబోతున్నారనే తెలియగానే చాలామంది ఆమె గురించి సెర్చ్ చేయడం మొదలుపెట్టారు.ఈ క్రమంలోనే ఆమెకు వివాహం జరిగిన విషయం చాలామందికి తెలియదని చెప్పాలి. అయితే 2015లో పెళ్లి చేసుకున్న ఈమె పలు మనస్పర్ధలు వల్ల మొదటి భర్త నుంచివిడాకులు తీసుకున్నారని ఇక మనోజ్ సైతం తన భార్యకు విడాకులు ఇవ్వడంతో వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి కనుక వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే ఏ విధమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు లేవని పలువురు భావిస్తున్నారు.