Mohan babu: టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్న మోహన్ బాబు…. మనోజ్ షాకింగ్ డిసిషన్?

Mohan babu: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. అప్పటివరకు వైకాపాలో ఎంతో కీలకంగా ఉన్న నేతలందరూ కూడా రాజీనామాలు చేస్తూ తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వలసలు వస్తున్నారు. ఇలా కూటమి పార్టీలలోకి భారీగా వలసలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలోనే సినీ నటుడు మోహన్ బాబు సైతం తిరిగి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.

నిజానికి మోహన్ బాబు 1995 నుంచి 2001 వరకు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. అన్న ఎన్టీఆర్ తో పాటు చంద్రబాబు నాయుడుతో కూడా మోహన్ బాబుకు చాలా మంచి అనుబంధం ఉంది అయితే కొన్ని భేదాభిప్రాయాల కారణంగా తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలిపారు..

ఇలా వైఎస్ఆర్సిపి పార్టీకి మద్దతు తెలిపి పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు ఏదైనా పదవి వస్తుందని మోహన్ బాబు భావించారు కానీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఎలాంటి పదవి ఇవ్వకపోవడంతో ఆయన కూడా పార్టీకి కాస్త దూరంగా ఉన్నారు. ఇకపోతే ఇటీవల తన కుటుంబంలో చోటు చేసుకున్నటువంటి గొడవల నేపథ్యంలో వీరి వ్యవహారం కాస్త కేసులు కోర్టుల వరకు వెళ్లింది. ఇలాంటి నేపథ్యంలోనే ప్రభుత్వాలతో కాస్త మంచిగా ఉండటం కరెక్ట్ అని భావించిన మోహన్ బాబు మనోజ్ ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ అధినేతలతో భేటీ అయ్యారు.

గతంలో చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన మనోజ్ ఇటీవల నారావారిపల్లెలో లోకేష్ తో కలిసి మాట్లాడిన సంగతి తెలిసిందే. అదేవిధంగా మరోవైపు మోహన్ బాబు కూడా చంద్రబాబు నాయుడుతో కలిసి సుదీర్ఘ చర్చలు జరిపారు. ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా మోహన్ బాబు యూనివర్సిటీ ముందు నారా లోకేష్ చంద్రబాబు నాయుడు ఉన్న ఫ్లెక్సీలు కనిపించడంతో మోహన్ బాబు తిరిగి తెలుగుదేశం పార్టీలోకి రాబోతున్నారని ఇలా ఫ్లెక్సీల ద్వారా సంకేతాలు అందజేశారని తెలుస్తోంది. మరోవైపు మనోజ్ సైతం తెలుగుదేశం పార్టీ అధినేతలతో పాటు జనసేన నేతలతో కూడా సన్నిహితంగా ఉన్నారు మరి ఈయన ఏ పార్టీలోకి చేరుతారు అనేది తెలియాల్సి ఉంది.