Manoj: గత కొద్దిరోజులుగా మంచు కుటుంబంలో వివాదాలు చోటుచేసుకున్నాయి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి అయితే ఇటీవల ఈ వివాదాలు కాస్త బహిరంగం అయ్యాయి. గత కొద్ది రోజుల క్రితం మంచు వారసులు రోడ్డుపైన ఇష్టానుసారంగా కొట్టుకోవడంతో ఈ విషయం కాస్త మీడియా వార్తలలోనూ సోషల్ మీడియాలోనూ సంచలనంగా మారింది.. ఇక ఉన్నఫలంగా వీరందరూ సైలెంట్ కావడంతో ఈ కుటుంబంలో వివాదాలు పరిష్కారం అయ్యాయని అందరూ భావించారు.
ఇలా ఈ వివాదాలు పరిష్కారమయ్యాయని అందరూ భావిస్తున్న నేపథ్యంలో మరోసారి ఈ కుటుంబ గొడవలు మొదటికే వచ్చాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మంచు మోహన్ బాబు విష్ణు కుటుంబ సభ్యులందరూ కూడా తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో సంక్రాంతి పండుగను జరుపుకున్నారు. అయితే కనుమ రోజు మనోజ్ మౌనిక దంపతులు యూనివర్సిటీకి వెళ్లారు అయితే అక్కడ తనని రాకుండా మోహన్ బాబు అడ్డుకున్నారు.
బుధవారం మంచు మనోజ్ నారావారి పల్లెకూ దురుద్దేశంతోనే వచ్చాడని.. అనంతరం మోహన్ బాబు విద్యాసంస్థల వద్దకు సుమారు 200 మందితో కలిసి వెళ్లాడని.. అయితే లోపలకు రావడానికి అనుమతి తెలపలేదని మోహన్ బాబు వెల్లడించారు. ఇలా మరోసారి గొడవలు చోటు చేసుకున్న నేపథ్యంలో మంచు మనోజ్ ఏకంగా తన తండ్రి మోహన్ బాబు అలాగే తన అన్నయ్య విష్ణు పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ గొడవ బుధవారం జరగగా గురువారం ఉదయం మంచు మనోజ్ చంద్రగిరి పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. బుధవారం మోహన్ బాబు విద్యాసంస్థల వద్ద జరిగిన ఘటనపై పోలీసులతో చర్చలు జరిపి, అనంతరం తనను అడ్డుకోవడంపై ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. ఇలా మనోజ్ మరోసారి పోలీస్ స్టేషన్ కి వెళ్లడంతో ఈ కుటుంబంలోని వివాదాలు ఇంకా సర్దుమనగడం లేదని తెలుస్తోంది. ఇక మనోజ్ తన గొడవ ఆస్తి కోసం కాదని చెబుతూనే తరచూ తన కుటుంబ సభ్యులతో గొడవ పడటంతో అసలు వీరి మధ్య ఏం జరిగింది అనే విషయంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.