Manoj -Mounika: భారీ ర్యాలీతో ఆళ్లగడ్డకు పయనమైన మనోజ్ మౌనిక… పొలిటికల్ ఎంట్రీ పై ప్రకటన?

Manoj -Mounika: మంచు మనోజ్ భూమా మౌనిక భారీ ర్యాలీతో ఆళ్లగడ్డకు ప్రయాణమయ్యారని తెలుస్తోంది. నేడు మౌనిక తల్లి శోభిత జయంతి కావడంతో ఈమె ఆళ్లగడ్డకు వెళ్లే అక్కడ తన తల్లి శోభ నాగిరెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించబోతున్నారు. ఇప్పటికే మనోజ్ మౌనిక ఇద్దరు కూడా ఆళ్లగడ్డ పయనమయ్యారని తెలుస్తుంది. మరోవైపు తన అక్క అఖిల ప్రియ ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే తన తల్లి ఘాట్ వద్ద ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయని తెలుస్తుంది. అయితే గత కొంతకాలంగా అఖిల ప్రియ మౌనిక మధ్య కూడా పరస్పర భేదాభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో వీరి మధ్య మాటలు లేవని సమాచారం.

ఈ క్రమంలోనే తన తల్లి ఘాట్ వద్దకు కూడా ఇద్దరు కలిసి రాకపోవచ్చని తెలుస్తుంది. అదేవిధంగా ఇటీవల మోహన్ బాబు కుటుంబంలో వివాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఎమ్మెల్యే అయినప్పటికీ అఖిల ప్రియ మాత్రం గొడవకు తనకు ఏ మాత్రం సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే నేడు తన తల్లి జయంతి కావడంతో భూమా మౌనిక మనోజ్ పొలిటికల్ ఎంట్రీ పై కూడా సంచలన విషయాలను వెల్లడించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఇటీవల తన కుటుంబంలో తన పట్ల జరుగుతున్న దాడులను పూర్తిగా ఖండిస్తున్న మనోజ్ తనకంటూ ఓ బలం ఉండాలని నిర్ణయం తీసుకున్నారట. ఈ క్రమంలోనే రాజకీయాలలోకి రావాలనే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే ఇప్పటికే భూమా కుటుంబ మద్దతుదారులందరికీ కూడా ఈ విషయం తెలియజేయడంతో భారీగా వీరికి సంఘీభావం తెలపడానికి కార్యకర్తలు కూడా తరలి వస్తున్నారని సమాచారం.

ఇకపోతే మంచో మనోజ్ భూమా మౌనిక ఏ పార్టీలో చేరబోతున్నారనేది కూడా చర్చలకు కారణమైంది ప్రస్తుతానికి భూమా అఖిలప్రియ టిడిపి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇక మోహన్ బాబు కూడా గతంలో టిడిపి పార్టీ కోసం పనిచేశారు. ఈ క్రమంలోనే మనోజ్ మౌనిక ఇద్దరు కూడా జనసేన పార్టీలోకి చేరబోతున్నారు అంటూ ఆళ్లగడ్డలో ఈ వార్త చెక్కర్లు కొడుతుందని తెలుస్తోంది. మొదటినుంచి కూడా పవన్ కళ్యాణ్ తో మనోజ్ ఎంత సన్నిహితంగా ఉన్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి జనసేన పార్టీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. మరి అది ఎంతవరకు నిజమో మరి కాసేపట్లో తెలియనుంది.

🔴LIVE : 1000 కార్లతో ఆళ్లగడ్డకు మౌనిక, మనోజ్‌ | Manchu Manoj And Mounika Going To Allagadda | RTV