ఈరోజు మహేష్, జక్కన్న ప్రాజెక్ట్ పై సెన్సేషనల్ అప్డేట్??

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర చాలానే మాసివ్ కాంబినేషన్ లు ఉండొచ్చు కానీ వాటి అన్నిటినీ మించి ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ బిగ్గెస్ట్ కాంబినేషన్ ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే ఆస్కార్ విన్నింగ్ సినిమా తీసిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ల రాజమౌళిల కాంబినేషన్ సినిమానే అని చెప్పాలి.

కాగా ఈ భారీ చిత్రం ఇంకా స్టార్ట్ కావాల్సి ఉంది. అంతే కాకుండా ఎప్పుడో దశాబ్ద కాలం నుంచి ఎదురు చూస్తున్న ఈ కాంబినేషన్ ఫైనల్ గా ఇప్పుడు సెట్ అయ్యింది. అయితే ఈరోజు ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి ఏదన్నా ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి.

ఎందుకంటే ఈ ఇద్దరు కూడా ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరవుతున్నారు. దీనితో ఈ ఈవెంట్ నుంచి ఖచ్చితంగా ఫ్యాన్స్ నుంచి ఇద్దరి మీద మెయిన్ గా రాజమౌళి మీద ఫ్యాన్స్ ఒత్తిడి ఉంటుంది. మరి ఇందులో రాజమౌళి ఏమన్నా చెప్పే ఛాన్స్ లు చాలానే ఉన్నాయి.

కాగా వీరు బాలీవుడ్ చిత్రం “ఆనిమల్” ప్రీ రిలీజ్ కి హాజరు కానున్నారు. హీరో రణబీర్ కపూర్ నటించిన ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించాడు. తెలుగులో భారీ రిలీజ్ కి వస్తున్నా ఈ సినిమా అంచనాలు మరింత పెంచేలా మహేష్ రాజమౌళి ఇద్దరినీ ఇవాళ వేడుకకి పిలిచారు.

దీనితో ఈ ఈవెంట్ ని వారు గ్రేస్ చేయనున్నారు. దీనితో ఒకే స్టేజి పై ఈ సెన్సేషనల్ కలయిక సాధ్యం అవుతుండడంతో ఖచ్చితంగా మహేష్ రాజమౌళి ల అవైటెడ్ ప్రాజెక్ట్ పై ఓ మాసివ్ అప్డేట్ ని ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి జక్కన్న ఏమన్నా రివీల్ చేస్తాడేమో చూడాలి.