పెళ్లికి ముందే గర్భవతిని… అసలు విషయం బయటపెట్టిన అలియా భట్!

బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఆలియా భట్ త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇలా ఈ సినిమాతో తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి ఈమె అనంతరం రణబీర్ కపూర్ తో కలిసి నటించిన బ్రహ్మాస్త్ర సినిమా ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా సినిమాల పరంగా బాలీవుడ్ హాలీవుడ్ టాలీవుడ్ అని ఎలాంటి భేదాలు లేకుండా వరుస అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇకపోతే ఈమె ఈ ఏడాది ఏప్రిల్ నెలలో తాను ప్రేమించిన వ్యక్తి, నటుడు రణబీర్ కపూర్ ను పెళ్లి చేసుకున్నారు .ఇలా ఏప్రిల్ నెలలో వివాహం జరిగిన రెండు నెలలకే వీరిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారని గుడ్ న్యూస్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడంతో అందరూ పెళ్లి అదేవిధంగా ఈమె నవంబర్ నెలలోనే బిడ్డకు జన్మనివ్వడంతో ఈమె పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అని ప్రెగ్నెంట్ కావడంతోనే పెళ్లి చేసుకున్నారంటూ నేటిజన్స్ సందేహాలను వ్యక్తపరిచారు.

ఈ క్రమంలోనే తాజాగా ఈ వార్తలపై మరోసారి నటి అలియా భట్ స్పందించారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తాను పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అనే విషయాన్ని బయట పెట్టారు. ఇలా తాను హాలీవుడ్ సినిమాకి కమిట్ అయిన తర్వాత తనకు ప్రెగ్నెన్సీ రావడంతో హాలీవుడ్ సినిమాలోని యాక్షన్ సన్నీ వేషాలలో నటించడానికి చాలా ఇబ్బంది పడ్డానని అయితే ఈ విషయం వారికి చెప్పడంతో నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారని ఈ సందర్భంగా ఈమె తన ప్రెగ్నెన్సీ గురుంచి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.