షాకింగ్ : వై ఎస్ జగన్ పై మంచు లక్ష్మి సెటైర్ వైరల్..!

టాలీవుడ్ లో ఉన్నటువంటి ఎన్నో స్టార్ ఫ్యామిలీస్ లో మంచు ఫ్యామిలీ కూడా ఎప్పుడూ కూడా ఏదొక ఇంట్రెస్టింగ్ పనితో సోషల్ మీడియాలో నిలుస్తూ ఉంటారు. ఒక్క మంచు మనోజ్ తప్ప మిగతా వారు అంతా మంచి హాట్ టాపిక్ గానే ఉంటారు. అయితే మంచు వారి కుటుంబం రాజకీయాల్లో కూడా ఎప్పటికప్పుడు ఏ ఎండకా గొడుగు పడతారని టాక్ కూడా ఉంది.

మరి దానికి తగ్గట్టే అప్పుడు ఏపీలో టీడీపీ ఇప్పుడు వైసీపీ కి అలాగే మళ్ళీ వైసీపీ తో విభేదాలు వచ్చినట్టుగా కూడా తెలిసింది. అయితే లేటెస్ట్ గా మంచు లక్ష్మి అయితే ఇక వైసీపీ అధినేత మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ పై సెటైర్ గా రిప్లై ఇవ్వడం షాకింగ్ గా మారింది.

ఎవరో నెటిజన్ జగన్ వీడియోపై ఎగ్జామ్ హాల్ లో ఉన్నప్పుడు పరిస్థితి ఇది అంటూ ఓ ఫన్నీ వీడియో లా పోస్ట్ చేసాడు. అయితే ఇది నార్మల్ ఆడియెన్స్ స్పందించి నవ్వుకున్నారు అంటే ఏమో కానీ మంచు లక్ష్మి కూడా దీనికి రిప్లై ఇస్తూ బాగా నవ్వుకున్నట్టుగా తెలిపింది.

దీనితో అయితే జగన్ కి వారికి ఉన్న దూరం నిజం చేస్తూ పైగా అందులో వ్యంగ్యాన్ని కూడా మిక్స్ చెయ్యడం అనేది ఇప్పుడు షాకింగ్ గా మారింది. దీనితో అయితే ఇప్పుడు మంచు లక్ష్మి ట్వీట్ రిప్లై వైరల్ గా మారింది. మొత్తంగా అయితే మంచు ఫ్యామిలీ ఏపీ సీఎం తో తెగదంపులు చేసుకున్నట్టే అనుకోవాలి.