సీనియర్ నటి గౌతమి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఎన్నో సినిమాలలో తనదైన నటనతో ప్రేక్షకుల మనసులు దోచుకుంది. నటిగా కన్నా కూడా కమల్‌తో సహజీవనం విషయంలో ఎక్కువగా హాట్ టాపిక్ గా మారింది. 1989లో సింగితం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన “అపూర్వ సహోదరులు” సినిమాలో కమల్ సరసన నటించింది గౌతమి. అప్పటి నుండి ఆయనతో మంచి ర్యాపో మెయింటైన్ చేసింది. 1998లో వ్యాపారవేత్త సందీప్ భాటియాను వివాహం చేసుకున్న గౌతమి ఏడాది తిరక్క ముందే విడాకులు తీసుకుంది. అప్పటికే తనకు సుబ్బలక్ష్మీ అనే కూతురు ఉండడంతో ఆమెతో విడిగా ఉండేది.
2005 నుంచి తన చిరకాల మిత్రుడైన కమల్ హాసన్ తో సహజీవనం ప్రారంభించిన గౌతమి దాదాపు పదేళ్ళకు పైగా భార్య భర్తలల సహజీవనం చేస్తూ వచ్చారు. కాని కుటుంబంలో వచ్చిన కలహాల వలన కొద్ది రోజుల క్రితం అతని నుండి విడిపోయింది. ఈ విషయాన్ని కూడా అఫీషియల్‌గానే ప్రకటించింది గౌతమి. ప్రస్తుతం తాను చెన్నైలోని కొట్టివక్కమ్ ప్రాంతంలో నివసిస్తున్నారు. అయితే సోమవారం రాత్రి పాండియన్ అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి గోడ పక్కన దాక్కున్నాడు. ఈ విషయాన్ని ఆ ఇంట్లో పని చేసే సతీష్ అనే వ్యక్తి గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు
నీలంకరై పోలీసులు గౌతమి ఇంటికి చేరుకోని దుండగుడిని అదుపులోకి తిసుకున్నారు. పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లాక అతనిని విచారించగా పలు విషయాలు చెప్పాడు. కొట్టివాక్కం కుప్పం ప్రాంతానికి చెందిన పాండియన్‌గా పోలీసులు అతనిని గుర్తించగా అతను మద్యం మత్తులో ఉన్నాడని చెప్పారు. అనుమతి లేకుండా ఇంట్లోకి ప్రవేశించి అంతా రచ్చ చేసినందుకు అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కొద్ది సేపటికే బెయిల్‌పై కూడా విడుదలయ్యాడు. అనుమానస్పద వ్యక్తిగా భావించిన పాండియన్ గౌతమ్ ఇంట్లో పని చేస్తున్న వ్యక్తి సోదరుడిని , అతనిని కలిసేందుకు అక్కడికి వెళ్ళాడని కోలీవుడ్ మీడియా చెబుతుంది.