GANGAVVA: సొంత ఇంట్లో గంగవ్వ‌.. ఫొటోలు వైర‌ల్

మై విలేజ్ షో కార్య‌క్ర‌మంతో అంద‌రి దృష్టి ఆకర్షించిన అవ్వ గంగ‌వ్వ‌. చ‌దువు లేక‌పోయిన ఆరు ప‌దులు వ‌య‌స్సు దాటిన త‌న‌లో దాగి ఉన్న ఉత్సాహంతో ఎంద‌రో మ‌న‌సుల‌ని కొల్ల‌గొట్టింది గంగ‌వ్వ‌. మై విలేజ్ షో అనే యూ ట్యూబ్ కార్య‌క్ర‌మంలో ప‌లు ప్రోగ్రాంలు చేసిన గంగ‌వ్వ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. దీంతో ఆమెకు సినిమా స్టార్స్‌తో న‌టించే అవ‌కాశంతో పాటు వారిని ఇంట‌ర్వ్యూ చేసే ఛాన్స్ కూడా వ‌చ్చింది. ఓ సారి స‌మంత‌ను ఇంట‌ర్వ్యూ చేసి అంద‌రి పొట్ట చెక్క‌ల‌య్యేలా న‌వ్వించింది. అంతేకాదు బిగ్ బాస్ చ‌రిత్ర‌లోనే తొలిసారి 60 ఏళ్ళ కంటెస్టెంట్ గంగ‌వ్వ హౌజ్‌లో అడుగుపెట్టి స‌రికొత్త రికార్డ్ న‌మోదుచేసింది.

ప‌చ్చ‌ని ప్ర‌కృతి మ‌ధ్య తిరిగే గంగ‌వ్వ బిగ్ బాస్ హౌజ్‌లో అడుగుపెట్టే స‌రికి అంద‌రు షాక్ అయ్యారు. నాలుగు గోడ‌ల మ‌ధ్య ఎలా ఉంటుంది. పాత‌కాలం నాటి మ‌నిషి ఇప్ప‌టోళ్ల‌తో క‌లిసి ఎలా మెసులుతుంది ఇలా ఎన్నో అనుమానాలు అంద‌రి మ‌దిలో మెదిలాయి. కాని వాట‌న్నింటిన పటాపంచ‌లు చేస్తూ బిగ్ బాస్ గేమ్ బాగానే ఆడింది గంగ‌వ్వ‌. అయితే ఇంటి మీద మ‌నాది ఎక్కువ కావ‌డంతో అనారోగ్యానికి గురైన గంగ‌వ్వ హౌజ్ నుండి మ‌ధ్య‌లోనే నిష్క్ర‌మించింది. గంగ‌వ్వ బిగ్ బాస్ హౌజ్‌ను వీడిన స‌మ‌యంలో చాలా మంది నిరుత్సాహానికి గుర‌య్యారు. చివ‌ర‌వ‌ర‌కు తప్ప‌క ఉంటుంద‌నుకున్న గంగ‌వ్వ ఇలా మ‌ధ్య‌లో బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని ఊహించ‌లేద‌ని అనుకున్నారు.

అయితే సొంతింటి క‌ల కోసం బిగ్ బాస్ హౌజ్ ణుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన గంగ‌వ్వ ఆ ఇంటిని పూర్తి చేసే ప‌నిలో ఉంది. బిగ్ బాస్ టీం గంగ‌వ్వ‌కు రూ. 5 ల‌క్ష‌లు పైగానే ఇవ్వ‌గా, నాగార్జున 7 లక్షలు , ఇల్లు క‌ట్టుకునేందుకు బిగ్ బాస్ ప్రత్యేకంగా 10 లక్షలు ఇచ్చాడు. అలా 20 లక్షలకు పైగానే పెట్టి ఇప్పుడు ఇల్లు కట్టుకుంటుంది గంగవ్వ. నిర్మాణ ప‌నులు స‌జావుగా జ‌ర‌గుతుండ‌గా, ఆ ఇంటిని చూసి గంగ‌వ్వ తెగ మురిసిపోతుంది. ప్ర‌స్తుతం గంగ‌వ్వ ఇంటి ఫొటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుండ‌గా, ఆమెకు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.