సాధారణంగా అబ్బాయి తనకంటే చిన్న వయసు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చెబుతుంటారు అలాంటి వివాహాలని మనం ఎక్కువగా చూస్తుంటాం. అయితే ఈ మధ్యకాలంలో జరిగే ప్రేమ వివాహాల్లో ఎలాంటి నిబంధనలు పాటించకుండా పెళ్లిళ్లు చేసుకోవడం జరుగుతోంది. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈరోజుల్లో అబ్బాయిలు తమ కంటే పెద్ద వయస్సు ఉన్న అమ్మాయిలని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారట. అందుకు గల కారణాలను పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలను వారు చెబుతున్నారు.
తమకంటే పెద్దవారైనా స్త్రీలతో ప్రేమలో పడడానికి కారణం తమకన్నా పెద్దవారైతే అన్ని విషయాల్లో మార్గదర్శకంగా ఉంటారు.అధిక పరిపక్వత స్థాయి, తెలివిగా కమ్యూనికేషన్, తక్కువ ఆధారపడటం మొదలైన అనేక కారణాల వల్ల పురుషులు తమ కంటే పెద్ద వయస్సు గల అమ్మాయిల వైపు ఆకర్షితులవుతారట. వయస్సులో ఎక్కువ పరిమితి చెందిన అమ్మాయిల్లో భావోద్వేగం పరిపక్వత చెంది స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇల్లు, కుటుంబం, జీవిత భాగస్వామి గురించి క్లారిటీ ఉంటుంది.అందువలన వారు మరింత ఆత్మ విశ్వాసంతో ఉంటారు. తమ భాగస్వామి తమపై ఎక్కువ శ్రద్ధ చూపాలని యువతులు కోరుకుంటే అలాంటి గందరగోళం ఉండదు. చిందరవందరగా, అస్పష్టంగా, జీవితాన్ని ఆస్వాదించే భావన ఎక్కువగా ఉంటుంది. భావోద్వేగాలపై నియంత్రణ కలిగి ఉండటం సహాయకరంగా ఉంటుంది. ఇవన్నీ పురుషులు ఇష్టపడే లక్షణాలు.
తమకంటే పెద్దవారైనా స్త్రీలను పురుషులు ఇష్టపడడానికి మరో కారణం వయసులో తమకన్నా పెద్ద స్త్రీలు, యువ పురుషుల కంటే ఎక్కువ జీవితానుభవాన్ని కలిగి ఉండడం వల్ల స్థిర ఆలోచనలతో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అనవసరపు దోబూచులాట లేకుండా వారికి ఏమి కావాలో వారికి స్పష్టంగా తెలుసు. ఎంతో ప్రణాళిక బద్ధంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది.ఆర్థిక స్వాతంత్ర్యం, భావోద్వేగ మద్దతు వయసులో పెద్ద మహిళలు సాధారణంగా ఆర్థికంగా స్వతంత్రంగా ఉంటారు.