గాసిప్స్ : “యాత్ర 2” కి మమ్ముట్టి షాకింగ్ రెమ్యునరేషన్?

ఇప్పుడు ఏపీలో రాజకీయ పరిస్థితులు సినిమాలతో బాగా కలిసిపోయిన సంగతి తెలిసిందే. జెనరల్ గా సినిమా రాజకీయం ఒకటి కాదు అంటారు కానీ ఏపీలో మాత్రం రెండు ఒకటే అన్నట్టుగా పరిస్థితులు ఉన్నాయి. ఇక ఎన్నికల సమయంలో అయితే గతంలో పలు చిత్రాలు కూడా వచ్చాయి.

సరిగ్గా ఎన్నికల ముందే రెండు ముఖ్య పార్టీలకి ఫెవర్ గా ఎన్టీఆర్ సహా రాజశేఖర్ రెడ్డి లపై సినిమాలు రాగా ఇక వీటిలో వై ఎస్ ఆర్ జీవిత చరిత్రపై ప్లాన్ చేసిన మాసివ్ సీక్వెల్ “యాత్ర 2” పై ఇంట్రెస్టింగ్ బజ్ వైరల్ గా మారింది. కాగా గతంలో వచ్చిన “యాత్ర” మంచి హిట్ కాగా దీనికి సీక్వెల్ అయితే ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి వై ఎస్ వారసుడు జగన్ పై అయితే ఉంటుంది అని కన్ఫర్మ్ అయ్యింది.

కానీ ఇందులో స్టార్ హీరో మమ్ముట్టి పాత్ర కూడా ఉంటుంది అని ఇద్దరిపై పలు సన్నివేశాలు ఉంటాయని కూడా రూమర్స్ వినిపిస్తుండగా మరి పార్ట్ 2 కి అయితే మమ్ముట్టి భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టుగా రూమర్స్ ఇపుడు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి ఏకంగా తాను 14 కోట్లు ఛార్జ్ చేస్తున్నారట.

మరి ఇలా ఓ మలయాళ హీరో తెలుగులో ఇంతమొత్తం తీసుకోవడం మొదటి సారి అని చెప్పాలి. కాగా ఈ గాసిప్స్ లో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో అయితే వై ఎస్ జగన్ గా తమిళ హీరో జీవా నటిస్తుండగా మహి వి రాఘవ ఈ సినిమాని దర్శకత్వం వహిస్తున్నాడు అలాగే వచ్చే ఏడాది ఎన్నికల ముందు అయితే ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.