Actor Mohan Raj: దక్షిణాదికి చెందిన ప్రముఖ సినీనటుడు మోహన్ రాజ్ (72) కన్నుమూశారు. తెలుగుతోపాటు మలయాళం, తమిళ, కన్నడ చిత్రాల్లోనూ ఆయన నటించి మెప్పించారు. గురువారం కేరళలోని తిరువనంతపురంలో తుదిశ్వాస విడిచారు. నటుడు, దర్శకుడు దినేశ్ పనికర్ ఈ విషయాన్ని తెలియజేశారు. మోహన్‌రాజ్‌కు భార్య ఉష, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మోహన్‌రాజ్ గత నాలుగు రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న మోహన్‌రాజ్‌ను వెంటిలేటర్ పై ఉంచారు. గురువారం మధ్యాహ్నం పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు.
Swag Movie Review: ‘స్వాగ్’ మూవీ ఎలా వుందంటే…
గత కొంతకాలంగా పార్కిన్సన్ తో బాధపడుతున్న మోహన్ రాజ్ కు ఇటీవల గుండెపోటు కూడా వచ్చింది. చికిత్స నిమిత్తం మోహన్‌రాజ్‌ను చెన్నలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఇంటికి తీసుకెళ్లాల్సిందిగా వైద్యులు సూచించారు. దీంతో కుటుంబసభ్యులు ఆయనను తిరువనంతపురంలోని కంజిరంకులం తీసుకువచ్చారు. అక్కడే మోహన్‌రాజ్ మృతి చెందారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో మోహన్‌రాజ్ ఎక్కువగా విలన్ పాత్రలనే చేశారు.
Kali Movie Review: ‘కలి’ మూవీ రివ్యూ : సస్పెన్స్ థ్రిల్లర్
తెలుగులో లారీ డ్రైవర్, శివయ్య అసెంబ్లీ రౌడీ, సమరసింహారెడ్డి చెన్నకేశవ రెడ్డి, తదితర సినిమాల్లో విలన్ పాత్రల్లో కనిపించారు. మోహన్ రాజ్ దాదాపు 300లకుపైగా సినిమాల్లో నటించారు. మోహన్‌రాజ్ మృతి పట్ల కేరళ సీఎం పినరయి విజయన్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సాజి చెరియన్ సంతాపం తెలిపారు. పలువురు సినీప్రముఖులు మోహన్‌రాజ్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేశారు.
కాగా, మోహన్‌రాజ్.. కిరిక్కాడాన్ జోస్ పేరుతో మలయాళంలో వందల చిత్రాల్లో నటించి మెప్పించారు. 1089లో సిబి మలయిల్ దర్శకత్వంలో వచ్చిన కిరీదామ్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ ఆఫీసర్‌గా పనిచేసే మోహన్ రాజ్.. సినిమాలపై మక్కువతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. మూన్నం మూర చిత్రంలో మోహన్‌రాజ్‌నటించారు. ఆ సినిమాలో మోహన్ రాజ్ నటనను చూసిన సిబిమలయిల్.. తన సినిమాలో విలన్ పాత్రకు ఎంపిక చేశారు. ఆయన అంచనాలను నిజం చేస్తూ తన నటనతో ఎంతో ఎత్తుకు ఎదిగారు మోహన్ రాజ్.
Dakshina Movie Review: దక్షిణ మూవీ రివ్యూ & రేటింగ్
ఆ తర్వాత మలయాళంతోపాటు తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లోనూ నటించి మెప్పించారు. మోహన్ లాల్ నటించిన కిరీడమ్ చిత్రంలో కీరిక్కడన్ జోస్ గా విలన్ పాత్రలో కనిపించిన మోహన్ రాజ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మూడు దశాబ్దాలపాటు ఆయన సినిమారంగంలో అనేక పాత్రలు పోషించి చెరగని ముద్ర వేశారు. కాగా, తెలుగులో మోహన్ రాజ్ నటించిన చివరి చిత్రం శివశంకర్. మోహన్ బాబు కథానాయకుడిగా రూపొందిన సినిమా ఇది.