నటీనటులు: సాయి ధన్సిక, రిషబ్ బసు, స్నేహ సింగ్, కరుణ,ఆర్నా ములెర్, మేఘన చౌదరి. మరియు నవీన్ తదితరులు
సాంకేతిక నిపుణులు:
ఛాయాగ్రహణం : రామకృష్ణ (ఆర్.కె) సంగీతం : బాలాజీ
నిర్మాణ సంస్థ: కల్ట్ కాన్సెప్ట్స్
నిర్మాత : అశోక్ షిండే
రచన – దర్శకత్వం : ఓషో తులసీరామ్.
Dakshina Movie Review: ‘కబాలి’ ఫేమ్ సాయి ధన్సిక కథనాయికగా రిషవ్ బసు మరొక ముఖ్య పాత్రలో నటించిన సినిమా “దక్షిణ”. డైరెక్టర్ ఓషో తులసిరామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
Dakshina: ఘనంగా దక్షిణ ప్రీ రిలీజ్ ఈవెంట్, అక్టోబర్ 4న థియేటర్స్ లో విడుదల !!!
కథ : దక్షిణ (సాయి ధన్సిక) ఒక సీరియస్ పోలీస్ ఆఫీసర్. సిటీ నాలుగు వైపుల వరుసగా అమ్మాయిల హత్యలు జరుగుతూ ఉంటాయి. ఒకరి తర్వాత ఒకర్ని కిడ్నాప్ చేసి ఆ అమ్మాయిలను అతి కిరాతకంగా తల నరికి చంపుతూ ఉంటాడు ఓ సైకో. అసలు ఆ సైకో ఎవరు ?, ఎందుకు అతను అతి దారుణంగా అమ్మాయిలను చంపుతున్నాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలు ఏమిటి ?, ఈ మధ్యలో ‘ఏసీపీ దక్షిణ’ జీవితంలో ఓ దారుణం జరుగుతుంది. ఆ దారుణం చేసిన సైకో పై దక్షిణ ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుంది ?, ఈ క్రమంలో దక్షిణ ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి ?, చివరకు దక్షిణ సాధించింది ఏమిటి ? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ: ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన ‘కబాలి’ ఫేమ్ సాయి ధన్సిక తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని ఎమోషనల్ అండ్ క్రైమ్ సీక్వెన్స్ స్ లో చాలా బాగా నటించింది. ప్రధానంగా కొన్ని కీలక సన్నివేశాల్లో తన తన పర్ఫార్మెన్స్‌తో సాయి ధన్సిక ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేసింది. మరో ప్రధాన పాత్రలో నటించిన రిషవ్ బసు కూడా చాలా బాగా నటించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో రిషవ్ బసు నటన చాలా బాగుంది. సీరియస్ క్రైమ్ సన్నివేశాల్లోని అతని నటన సినిమాకే హైలైట్ గా నిలిచింది.
Dakshina Movie: సాయి ధన్సిక “దక్షిణ” అక్టోబర్ 4న థియేటర్స్ లో
ఇక సాయి ధన్సిక క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ కూడా బాగానే ఉంది. అదేవిధంగా దర్శకుడు ఓషో తులసీరామ్ అమ్మాయిల హత్యల చుట్టూ అనేక కోణాల్లో సినిమాని నడిపిన విధానం కొన్ని చోట్ల బాగుంది. సుభాష్, ఆనంద భారతి తదితరులతో పాటు ఇతర పాత్రల్లో నటించిన నటీనటులు కూడా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. అన్నట్టు ‘సినిమా మొదటి సన్నివేశం’ సినిమా పై ఆసక్తిని పెంచింది.
ఈ దక్షిణ సినిమా ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్స్ ఆసక్తికరంగా ఉన్నాయి, కానీ ఫస్ట్ హాఫ్ పూర్తిగా గ్రిప్పింగ్ గా లేదని చెప్పాలి, ఇంకా బలంగా రాసుకుని ఉండాల్సింది. దీనికితోడు, అనవసరమైన ల్యాగ్ సీన్స్ కూడా ఎక్కువైపోయాయి.
ఒక ఏసీపీ పై ఒక సైకో కిల్లర్ తేలిగ్గా అఘాయిత్యం ఎలా చేయగలడు ?, సినిమా మొత్తం ఈ పాయింట్ చుట్టే తిరిగింది, ప్రేక్షకులు నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఆత్రుతతో సినిమాను చూస్తారు. ఇంటర్వెల్ ఎపిసోడ్ చాలా గ్రిప్పింగ్ గా ఉంది, ఊహించని మలుపులు సినిమాలో ఉన్నాయి, ఇక సెకండాఫ్ ని డైరెక్టర్ ఎమోషనల్ గా నడిపించిన విధానం చాలా బాగుంది, దర్శకుడు ఓషో తులసీరామ్ మంచి ప్రయత్నం చేశాడు. తప్పకుండా ఈ సినిమా అందరిని అలరిస్తుంది.
రేటింగ్: 3/5