Kali Movie Review: ‘కలి’ మూవీ రివ్యూ : సస్పెన్స్‌ థ్రిల్లర్‌

Kali Movie Review: శివ సాషు దర్శకత్వంలో లీలా గౌతమ్‌ వర్మ నిర్మాణ సారధ్యంలో రుద్ర క్రియేషన్స్‌ బ్యానర్‌ పై తెరకెక్కిన సినిమా ‘కలి’. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కిన ఈ సినిమా కి జీవన్‌ బాబు సంగీతం సమకూర్చగా విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుందాం..

Devara Movie Review: ‘దేవర’ మూవీ ఎలా ఉందటే…

కథ: శివరామ్‌ (ప్రిన్స్‌), వేద (నేహా కృష్ణ) ఇద్దరు ప్రేమించుకున్నారు. పెద్దలకు ఇష్టం లేకపోయినా ఎదురించి పెళ్లి చేసుకున్నారు. తన మంచి తనంతో తండ్రి వారసత్వం నుంచి వచ్చిన ఆస్తులను పోగొట్టుకుంటాడు శివరామ్‌. తన బంధువులే తనను మోసం చేయడం తో శివరాం బాధపడుతుంటారు. తన చేతకానితనంవల్లే తమ పరిస్థితి ఇలా అయ్యిందని వేద శివరామ్‌ ను వదిలివెళ్లిపోతుంది. ఒంటరితనంతో ఉన్న శివరామ్‌ కి సూసైడ్‌ ఆలోచనలు వస్తాయి. ఈ సమాజానికి తాను ఫిట్‌ అవునని ఉద్దేశ్యంతో ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమవుతాడు. ఆ సమయంలోనే తన ఇంటికి ఎవరో వస్తారు. ఓ గేమ్‌ ఆడదామా అని ప్రిన్స్‌ ని రెచ్చగొట్టి ఆ ఆటను ముందుకు తీసుకెళతాడు. ఇంతకీ శివరామ్‌ ఇంటికి వచ్చిందెవరు? సూసైడ్‌ చేసుకోవాలనుకున్న శివరామ్‌ చివరికి ఏం చేశాడు. అనేదే ఈ సినిమా కథ.

విశ్లేషణ : ప్రిన్స్‌ తన పాత్రలో సాదాసీదా వ్యక్తిగా కనిపించి మెప్పించాడు. నరేశ్‌ అగస్త్య కలి పురుషుడి పాత్రలో అద్భుతంగా నటించాడు. నేహా కృష్ణ, మణి చందన, సివిఎల్‌ నరసింహారావు, కెదార్‌ శంకర్‌ తమ పాత్రలను నిజాయతీగా చేశారు. చిన్న పాత్రలో కనిపించిన గాయత్రి గుప్తా తన నటనతో ఆకట్టుకుంది. ప్రియదర్శి, మహేష్‌ విట్టా, అయ్యప్ప శర్మ వాయిస్‌ ఓవర్‌ పనితనం పాత్రలకు మరింత బలం చేకూర్చింది. చిత్రం ఎక్కువ శాతం ఒకే ప్రదేశంలో, రాత్రి సమయంలోనే చిత్రీకరించబడింది. అయితే రమణ జాగర్లమూడి, నిశాంత్‌ కటారి సినిమాటోగ్రఫీ మెరుగ్గా ఉంది. జీవన్‌ బాబు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కొంచెం ఎక్కువగా వినిపించినప్పటికీ, దృశ్యాలకు కాస్త బలం చేకూర్చింది. సినిమాలో ఒక్క పాట మాత్రమే ఉన్నా, ఆ పాట ఆకట్టుకునే విధంగా ఉంది. కలి పాత్రతో పాటు అతని నివాసం డిజైన్‌ అద్భుతంగా నిలిచాయి.లీలా గౌతమ్‌ వర్మ చిన్న బడ్జెట్‌తో నిర్మించబడినప్పటికీ, సినిమా నిర్మాణ విలువలు స్పష్టంగా కనిపించాయి.

రేటింగ్‌: 2.5/5

ముస్లింలను చూసి నేర్చుకొండి || Pawan Kalyan Serious On His Fans At Varahi Public Meeting In Tirupati