శంకర్ కెరీర్ లో మూడవ సినిమాగా వచ్చింది ఇండియన్. ఈ సినిమా తెలుగులో భారతీయుడుగా రిలీజైంది. ఇండస్ట్రీకొచ్చిన మూడేళ్ళలోనే కమల్ హాసన్ లాంటి స్టార్ హీరో తో సినిమా చేసే అవకాశం దక్కించుకొని భారీ కమర్షియల్ సక్సస్ ఇచ్చాడు. ఈ సినిమాతో శంకర్ పేరు ప్రపంచమంతా మార్మోగిపోయింది. తీసింది తక్కువ సినిమాలే అయినా హాలీవుడ్ డైరెక్టర్ రేంజ్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు.
ఇండియన్ వచ్చి దాదాపు 23 ఏళ్ళు అవుతోంది. కాగా ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా కమల్ హాసన్ – శంకర్ కాంబినేషన్ లో ‘ఇండియన్ 2’ రూపొందుతుంది. ఈ నేపథ్యంలో ‘ఇండియన్ 2’ మీద భారీ స్థాయిలో అంచనాలు నెలకొనడంతో పాటు దేశమంతా ఎంతో ఆసక్తి నెలకొంది. వాస్తవంగా శంకర్ సినిమా తీస్తున్నాడంటే డిలే అవడం కామన్. కాని ఈ సినిమాకి మాత్రం ఊహించని విధంగా ప్రారంభం నుంచే అవాంతరాలు ఎదురవుతున్నాయి.
ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు దర్శక, నిర్మాతల మధ్య విబేధాలు వచ్చాయి. ఇందుకు కారణం శంకర్ గత చిత్ర ప్రభావమూ ఉంది అన్నారు. అందుకే బడ్జెట్ విషయంలో కొన్ని చర్చల జరిపిన తర్వాత దర్శకుడు ఇచ్చిన బడ్జెట్ లో సగానికి సినిమా పూర్తి చేసేలా నిర్మాతలు ఒప్పందం కుదుర్చుకున్నారు. తర్వాత సెట్లో ప్రమాదం జరగడం, ఆ తర్వాత కరోనా లాక్ డౌన్ తో సినిమా మీద బాగా ప్రభావం చూపించాయి.
దాంతో ఇండియన్ 2 ఆగిపోయిందన్న ప్రచారం జోరందుకుంది. కాని అవన్ని వాస్తవాలు లంటూ మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాకి భారీ క్రూతో షూటింగ్ జరపాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుండి ప్రత్యేక అనుమతులు తీసుకుంటున్నాము. అందుకే ప్రాజెక్ట్ డిలే అవుతుందని క్లారిటీ ఇచ్చారు. కాగా ఈ ఇయర్ ఆఖరు నుంచి ‘ఇండియన్ 2’ సెట్స్ మీదకి వెళ్ళబోతుంది అని సమాచారం.