ప్రస్తుతం టాలీవుడ్ సినిమా దగ్గర భారీ అంచనాలు ఉన్న లేటెస్ట్ సినిమాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ చేస్తున్న 28వ సినిమా కూడా ఒకటి. అయితే ఈ చిత్రాన్ని దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఐతే తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ సినిమా ఈ క్రేజీ కాంబో లో మూడో సినిమా కావడంతో హైప్ చాలా ఉంది.
కానీ ఈ సినిమా మొదట ఓ భారీ ఏక్షన్ ప్రాజెక్ట్ గా అనౌన్స్ చేయగా తర్వాత ఇది కాస్త ,ఫామిలీ ఏక్షన్ డ్రామాగా మారింది. అయితే మొదట్లో సినిమాపై చాలానే రూమర్స్ వచ్చాయి. మహేష్ స్క్రిప్ట్ మార్చమన్నాడు అని అలాగే సంగీత దర్శకుడు థమన్ విషయంలో కూడా మహేష్ అంత పాజిటివ్ గా లేడని వార్తలు ఉన్నాయి.
అయితే ఇప్పుడు నిజంగానే మహేష్ ఈ సినిమా పట్ల అంత ఆసక్తిగా లేడా అనే అవుననే అనిపిస్తుంది మహేష్ ఈ సినిమా స్టార్ట్ చేసాక చాలానే వెకేషన్స్ కి వెళ్ళాడు. మధ్యలో కొన్ని పర్సనల్ రీజన్స్ మూలాన సినిమా స్లో అవుతూ వచ్చింది కానీ ఇప్పుడు కూడా మళ్ళీ మరో మూడు వారాలు అయితే గ్యాప్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది.
మూడు వారాలు ఇప్పుడు మహేష్ ఫామిలీ వెకేషన్ కి వెళ్తుండగా దీనితో అయితే ఫ్యాన్స్ కూడా నిజంగానే మహేష్ కి ఈ సినిమాపై అంత ఆసక్తి లేదేమో అనుకుంటున్నారు. గతంలో ఏ సినిమాకి కూడా మహేష్ ఇంతలా సో సో గా చేయలేదు. దీనితో ఈ సినిమా ఏదో చెయ్యాలి అన్నట్టు చేస్తున్నాడని కొందరు అంటున్నారు. మరి దీనికి అసలు కారణం ఏంటో తెలియాలి.