‘శ్రీమంతుడు’ తో సంచలన రికార్డు సెట్ చేసిన మహేష్ బాబు.!

179-1793662_mahesh-babu-images-beard-mahesh-babu-new-look

టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోస్ లో భారీ మార్కెట్ ఉన్న స్టార్ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకడు. మరి మహేష్ బాబు కెరీర్ లో వరుసగా భారీ ప్లాప్ లు అందుకుంటున్న సమయంలో చేసిన సినిమానే “శ్రీమంతుడు”. అప్పటికే ప్రభాస్ తో మిర్చి అనే సినిమా చేసి హిట్ అందుకున్న దర్శకుడు కొరటాల శివతో చేసిన ఈ సినిమాలో అప్పట్లో భారీ హిట్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ ని సెట్ చేసింది.

అంతే కాకుండా మహేష్ బాబు నుంచి బిగ్గెస్ట్ కం బ్యాక్ గా నిలిచి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా అయితే నిలిచింది. మరి ఈ సినిమా ఆ తర్వాత యూట్యూబ్ లో కూడా రిలీజ్ చేయగా ఊహించని విధంగా అక్కడ కూడా ఫ్యామిలీ ఆడియెన్స్ ఎంతగానో ఆదరించారు. ఇది తెలుగులో అయితే ఏ సినిమాకి కూడా జరగలేదు.

ఆ రేంజ్ లో మొట్ట మొదటి సారిగా ఈ సినిమా 100 మిలియన్ వ్యూస్ అందుకున్న సినిమాగా యూట్యూబ్ నుంచి ఫస్ట్ ఎవర్ రికార్డు సాధించగా ఇప్పుడు ఊహించని విధంగా ఏకంగా 200 మిలియన్ వ్యూస్ ని ఇప్పుడు ఈ చిత్రం క్రాస్ చేసింది. దీనితో తెలుగు వెర్షన్ నుంచి ఈ రేంజ్ రెస్పాన్స్ ఉన్న సినిమాగా ఇది ఒకటే నిలిచింది.

అయితే ఈ స్థాయిలో రెస్పాన్స్ మాములుగా తెలుగు సినిమా హిందీ డబ్బింగ్ చిత్రాలకి యూట్యూబ్ నుంచి ఉంటాయి. కానీ అలాంటిది ఒక్క తెలుగు వెర్షన్ నుంచే ఈ రేంజ్ రెస్పాన్స్ అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. కాగా ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.