మహేష్ బాబు సర్కారు వారి పాట మొదలైనా ఇంకా ఆ విషయం తేలలేదు..?

మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. తాజాగా ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో ప్రారంభం అయింది. నెలరోజుల పాటు ప్లాన్ చేసిన ఈ భారీ షెడ్యూల్ లో ముఖ్యంగా మహేష్ బాబు – కీర్తి సురేష్ మీద కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అలాగే సాంగ్స్ కూడా ప్లాన్ చేసినట్టు సమాచారం. జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్, 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక రెండవ హీరోయిన్ గా సాయీ మంజ్రేకర్ నటించబోతుందని సమాచారం.

సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ బాబు తో పాన్ ఇండియన్ సినిమా చేయాలనుకున్న దర్శకుడు పరశురాం బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న భారీ కుంభకోణాల నేపథ్యాన్ని తీసుకున్నాడు. మహేష్ లాంటి పాన్ ఇండియన్ అప్పీల్ ఉన్న హీరోకి ఇలాంటి యూనివర్సల్ కథ అయితే పాన్ ఇండియన్ రేంజ్ సినిమాకి కరెక్ట్ గా సూటవుతుందన్నదే పరశురాం ప్లాన్. అందుకే దుబాయ్ తో పాటు.. అమెరికాలో కూడా భారీ షెడ్యూల్స్ ప్లాన్ చేశాడు. అయితే సర్కారు వారి పాట సినిమాలో ఇప్పటి వరకు విలన్ ఎవరన్నది ఫైనల్ కాలేదట.

అందుకే ముందు మహేష్ బాబు – కీర్తి సురేష్ ల మీద సీన్స్ కి షెడ్యూల్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. కాగా ధృవ సినిమాతో స్టైలిష్ విలన్ గా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న అరవింద స్వామి ని సర్కారు వారి పాట కి అనుకుంటున్నట్టు తాజా సమాచారం. ఇప్పటికే అరవింద స్వామి ని చిత్ర యూనిట్ సంప్రదించినట్టు కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. కాని ఇంకా అరవింద స్వామి నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని అంటున్నారు. మరి ఈ సినిమాలో అత్యంత కీలక పాత్ర అయిన విలన్ క్యారెక్టర్ కి మేకర్స్ ఎవరిని తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.