ఈ చిన్న సినిమాకి మహేష్ పెద్ద రివ్యూ.!

టాలీవుడ్ లో పలు చిత్రాలు హిట్ అయితే మాత్రం మన వాళ్ళు దాన్ని గుండెల్లో పెట్టుకుంటారు. మరి అలా లేటెస్ట్ గా టాలీవుడ్ లో వచ్చి ఆడియెన్స్ లో క్లీన్ హిట్ గా నిలిచిన ఓ చిన్న చిత్రం “రైటర్ పద్మభూషణ్”. యువ నటుడు సుహాస్ నటించిన ఈ సినిమా ఇప్పుడు ఫామిలీ ఆడియెన్స్ నుంచి మంచి ఆదరణను అందుకొని అయితే సుహాస్ కెరీర్ లోనే పెద్ద హిట్ గా నిలిచింది.

కాగా ఈ సినిమాని ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు రివ్యూ చేయడం సినీ వర్గాల్లో ఆసక్తిగా మారింది. తాను సినిమా చూడడమే కాకుండా ప్రత్యేకంగా సినిమా కోసం పోస్ట్ పెట్టి మరీ చిత్ర యూనిట్ ని అభినందించారు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ అంశం ఏది అంటే మహేష్ చాలా రోజులు తర్వాత ఓ సినిమా చూసి రివ్యూ చెప్పడం విశేషం.

ఇంతకీ మహేష్ అయితే ఈ సినిమా కోసం ఏం చెప్పాడు అంటే “రైటర్ పద్మభూషణ్” చూసి చాలా ఎంజాయ్ చేసానని ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ చాలా నచ్చింది అని సుహాస్ అద్భుతంగా నటించాడు” అంటూ చిత్ర యూనిట్ పై మహేష్ ప్రశంసల వర్షాన్ని తాను కురిపించాడు.

దీనితో ఈ చిన్న సినిమాకి మహేష్ ఇచ్చిన రివ్యూ అనేది సినీ వర్గాల్లో ఆసక్తిగా మారడమే కాకుండా ఈ సినిమాకి కూడా చాలా పెద్ద బూస్ట్ అని చెప్పొచ్చు. కాగా ఈ సినిమా ని కొత్త డైరెక్టర్ షణ్ముఖ ప్రశాంత్ వర్క్ చేసాడు.