సర్కారు వారి పాట ని మరో నెల వెనక్కి నెట్టిన మహేష్ బాబు ..?

సర్కారు వారి పాట సినిమాతో మహేష్ బాబు ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రావాలని భావించాడు. మే నెలలోనే సర్కారు వారి పాట సినిమా టైటిల్ తో పాటు మహేష్ బాబు ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. సర్కారు వారి పాట అన్న టైటిల్ అలాగే మహేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా సర్కారు వారి పాట టైటిల్ అండ్ మహేష్ బాబు లుక్ ని రిలీజ్ చేసిన చిత్ర బృందం ఆ తర్వాత మహేష్ బాబు బర్త్ డే కి మరొక పోస్టర్ ని రిలీజ్ చేశారు.

Mahesh Babu To Look Different In Sarkari Vaari Paata. - Telugu  @urstrulymahesh Keerthy Suresh Stylish Mass Parasuram Sarkaru Paata  Tollywood-TeluguStop

ఈ రెండు పోస్టర్స్ తోనే సినిమా మీద అంచనాలు ఎక్కడికో వెళ్ళిపోయాయి. దానికి తోడు వరసగా మహేష్ బాబు బ్లాక్ బస్టర్స్ అందుకోవడం కూడా సర్కారు వారి పాట సినిమా మీద అంచనాలు పెరగడానికి కారణం అయింది. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ఇప్పటికే హీరోయిన్ గా కీర్తి సురేష్ ని ఫైనల్ చేశారు. అలాగే అమెరికాలో 45 రోజుల లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. అలాగే హైదరాబాద్ లో నెల రోజులకి పైగానే షూటింగ్ జరిపేందుకు భారీ బ్యాంక్ సెట్ ని నిర్మించారు.

ఈ రెండు షెడ్యూల్స్ తో దాదాపు సర్కారు వారి పాట ని కంప్లీట్ చేయాలనుకున్నాడు మహేష్ బాబు. దర్శకుడు పరశురాం కూడా అందుకు తగ్గట్టే అన్ని పక్కాగా ప్లాన్ చేశాడు. హీరోయిన్ కీర్తి సురేష్ కూడా సర్కారు వారి పాట సినిమా కోసం బల్క్ డేట్స్ కేటాయించింది. కాని కరోనా వల్ల మొత్తం ప్లాన్ డిస్టర్బ్ అయింది. అనుకున్నట్టుగా షూటింగ్ మొదలవలేదు. గత నెల పూజా కార్యక్రమాలు నిర్వహించి జనవరి నుంచి హైదరాబాద్ లో షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్టు మేకర్స్ వెల్లడించారు. కాని ఇప్పుడు మహేష్ బాబు జనవరి కాకుండా ఫిబ్రవరి నుంచి సర్కారు వారి పాట ని మొదలు పెట్టాలని దర్శకుడికి సూచించినట్టు సమాచారం. అందుకు కారణం ఇంకా కరోనా వ్యాప్తి కొనసాగుతుండటమే.