టాలీవుడ్ ఎవర్ గ్రీన్ చార్మింగ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా యంగ్ సెన్సేషన్ శ్రీ లీల అలాగే పాన్ ఇండియా హీరోయిన్ పూజా హెగ్డే లు హీరోయిన్స్ గా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న సినిమా కోసం అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమా మహేష్ కెరీర్ లో 28వ సినిమా కాగా త్రివిక్రమ్ తో తనకి హ్యాట్రిక్ సబ్జెక్టు ఇది.
దీనితో మంచి అంచనాలు ఉన్న ఈ సినిమా అయితే మరీ అంత ఇంట్రెస్టింగ్ గా షూటింగ్ జరగట్లేదు. మొదట ఓ సబ్జెక్టు అనుకోని మరో సబ్జెక్టు తీయడం తర్వాత దానిలో కూడా చాల వరకు సీన్స్ వేస్టేజ్ గా కట్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ఇక ఇవి పక్కన పెడితే ఫాన్స్ మాత్రం సినిమా అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుండగా..
నిన్ననే ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ని అయితే ఈ మే 31న థియేటర్స్ లో రిలీస్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేయగా ఈరోజు కూడా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉందని మేకర్స్ తెలిపారు. ఇక ఈ అప్డేట్ అయితే ఇప్పుడు రివీల్ అయ్యింది. మరి ఈ అప్డేట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.
మహేష్ పై స్టన్నింగ్ మాస్ పోస్టర్ తో అయితే త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు. మన టాలీవుడ్ హీరోలు ప్లస్ ఎర్ర తువాలు అంటే ఆ మాస్ ఎలా ఉంటుందో తెలిసిందే. ఇప్పుడు మహేష్ తో ఇదే ప్లాన్ చేసినట్టుగా ఈ పోస్టర్ చూస్తే అర్ధం అవుతుంది. అలాగే ఈ మే 31న అయితే మహేష్ మాస్ స్ట్రైక్ అంటూ కూడా కన్ఫర్మ్ చేశారు. కాగా ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా హారికా హాసిని ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
A MASS Feast For Fans and By Fans! #SSMB28MassStrike to thunder its way on 𝟑𝟏𝐬𝐭 𝐌𝐀𝐘! ⚡😎
SUPER FANS will unveil Striking video at the 𝐓𝐇𝐄𝐀𝐓𝐑𝐄𝐒!! 🤩🎥
Super 🌟 @urstrulyMahesh #Trivikram @hegdepooja @sreeleela14 @MusicThaman @vamsi84 #PSVinod @NavinNooli… pic.twitter.com/l3VKLuyqWP
— Haarika & Hassine Creations (@haarikahassine) May 27, 2023