మన హిందూ సంస్కృతిలో వివాహానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇత్త వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు తమ పిల్లలకు వివాహం జరిపిస్తారు. ఎంతో సాంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ వివాహ కార్యక్రమానికి చాలా ప్రాముఖ్యత ఉంది. వివాహం తర్వాత మహిళలు మంగళసూత్రం ధరించటం పూర్వం నుండి ఆనవాయితీగా వస్తోంది. పెళ్లి అయిన తర్వాత మహిళలు కళ్యాణపు ఉంగరాన్ని, కాలి మెట్టలను, మంగళసూత్రం, నుదుటిపై కుంకుమ పెట్టుకోవడం ఆనవాయితీ. వివాహం తర్వాత వివరించటం వల్ల ఆ మహిళలకు సమాజంలో ఒక ప్రత్యేకమైన గౌరవం ఏర్పడుతుంది.
అందుకే వివాహం జరిగిన తర్వాత మహిళలు వీటిని కచ్చితంగా ధరించాలని పెద్దవారు చెబుతూ ఉంటారు. మంగళసూత్రానికి చాలా విశిష్టత ఉంటుంది. మంగళ సూత్రం అంటే మంగళకరమైన బంధం అని అర్థం. పెళ్లి రోజున వరుడు వధువు మెడలో కట్టే ప్రత్యేకమైన ఎప్పటికీ విడదీయలేని పవిత్రమైన అనుబంధమే మంగళసూత్రం. నిబద్ధతకు, ప్రేమకు, నమ్మకానికి చిహ్నంగా భర్త బ్రతికున్నంత కాలం భార్య మంగళ సూత్రాన్ని ధరించాలి. అయితే ఎంతో పవిత్రంగా భావించే మంగళ సూత్రం విషయంలో మహిళలు కొన్ని జాగ్రత్తలను కచ్చితంగా పాటించాలి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
వివాహ సమయంలో భర్త కట్టిన మంగళసూత్రాన్ని మహిళా ఎప్పుడు మెడలోనే ఉంచుకోవాలి. మంగళసూత్రాన్ని ఎప్పుడూ పడితే అప్పుడు మెడలో నుంచి అస్సలు తీయకూడదు. వివాహిత మంగళసూత్రాన్ని తీయడం అంటే భర్త మరణించిన తర్వాతే. కాబట్టి భర్త ఆయుష్షు కోసం మంగళ సూత్రాన్ని ఎప్పటికీ మెడలోనే ఉంచాలి. మంగళ సూత్రం పోయిన, విరిగిపోయిన అరిష్టంగా భావిస్తారు. ఇలా జరగటం వల్ల భర్త ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని ప్రజల నమ్మకం. అలాగే పవిత్రంగా భావించి ఆ మంగళసూత్రానికి పొరపాటున కూడా పిన్నిసులు పెట్టకూడదు. అలాగే ఇంతటి అత్యవసర పరిస్థితి అయినా కూడా మంగళవారం శుక్రవారం రోజున మంగళసూత్రం మెడలో నుండి అసలు బయటికి తీయకూడదు.