పెళ్లి తర్వాత మొదటి హోలీ జరుపుకుంటున్నారా… ఇలా సెలబ్రేట్ చేసుకోండి!

సాధారణంగా ఫిబ్రవరి నెలలో పెళ్లి ముహూర్తాల అధికంగా ఉంటాయి కనుక ఎంతోమంది పెళ్లి బంధంతో ఒకటవుతారు అయితే ఇలా పెళ్లి జరిగిన తర్వాత చాలామంది దంపతులు మొదటిసారి హోలీ పండుగను జరుపుకుంటూ ఉంటారు ఇలా హోలీ పండుగను జరుపుకునే సమయంలో కొత్తజంట సంతోషంగా ఉండాలి అంటే తమహోలీనే ఇలా సెలబ్రేట్ చేసుకోవడం వల్ల ఆ జంట సంతోషంగా ఉంటారు.

ఇలా పెళ్లి తర్వాత మీకు ఇది మొదటి హోలీ అయితే మీ జీవిత భాగస్వామిని సంతోష పెట్టడం కోసం ఆమెకు ఆరోజు ఇష్టమైన పనులు అన్నింటిని చేయడం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా తనకు ఎంతో ఇష్టమైన బ్రేక్ ఫాస్ట్ తో ఆరోజున ప్రారంభించండి. అలాగే మీ భార్య తరపు కుటుంబ సభ్యులను కూడా ఆహ్వానించి తనకు సర్ప్రైజ్ ఇవ్వండి. ఇక హోలీని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి కుదరని పక్షంలో మీ కుటుంబ సభ్యులు మీ భార్య కుటుంబ సభ్యులను స్నేహితులను ఆహ్వానించి మీ ఇంటి ఆవరణంలోనే హోలీ పండుగను సెలబ్రేట్ చేసుకోండి.

ఇద్దరు కలిసి సరదాగా డ్రింక్స్ తాగుతూ డాన్స్ చేస్తూ ఈ పండుగను జరుపుకోవచ్చు. అనంతరం ఇద్దరు ఒకే రకమైన దుస్తులను ధరించి ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇలా కుటుంబ సభ్యుల సమక్షంలో రంగులు చల్లుకుంటూ సరదాగా హోలీ పండుగను జీవిత భాగస్వామికి మీ పట్ల మరింత ప్రేమ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇక హోలీ పండుగ సందర్భంగా మీ భార్యకు ఏదైనా కానుకను అందించి తనని సంతోష పెట్టడం కూడా ఎంతో ముఖ్యం.