నటి, రాజకీయ నాయకురాలు మాధవీలత సోషల్ మీడియాలో చేసే కామెంట్స్, పోస్ట్‌లు ఎంతటి వివాదానికి దారి తీస్తుందో అందరికీ తెలిసిందే. తాజాగా తన కరెంట్ బిల్ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి, విద్యుత్ బోర్డ్‌ను, ఎయిర్‌టెల్‌ను ఇలా ప్రతీ ఒక్కరినీ ఆటాడుకుంది. రూ.7500 బిల్లు వస్తే రెండు సార్లు కట్టించుకున్నారని, తన డబ్బులు ఎవరు మింగారంటూ కేటీఆర్, కేసీఆర్‌ను ప్రశ్నించింది. ఇక ఈ పోస్ట్‌పై మాధవీలతను దారుణంగా ట్రోల్స్ చేస్తూ నెగెటివ్ కామెంట్స్ చేశారు.
నెటిజన్ల కామెంట్లకు ధీటుగా సమాధానమిచ్చింది మాధవీలత. ఈ మేరకు నెటిజన్ల కామెంట్లకు రిప్లై ఇస్తూ.. ఇది నా ఒక్కదాని సమస్య కాదే ప్రజల సమస్య. ఇది అడిగితే నా వాల్‌లో ఇంతమందికి కాలింది. అంటే వీళ్లందరూ ఎంత బాధ్యతారాహిత్యంగా ఉన్నారు, అమ్మా నాన్న పెడుతుంటే మింగి కూర్చుని ఇంత ఖాళీగా ఉన్నారు. అసలు పవర్ బిల్ కట్టే విషయంలో పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారో తెలియని వాళ్లే సగం.. ఉద్దెర సొమ్ము తినేవాళ్లు సగం..
కర్మరా నాయనా.. ఈ దేశాన్ని పాలించే ఆయనకు మొక్కాలి ఇంత దరిద్రులున్నారి ఉఫ్.. ప్రజల సమస్య అడిగితే కూడా ఇంతమందికి మండింది అంటే.. ఎంత బేవార్స్‌గాల్లు ఉన్నారో.. అర్థమైంది. ఐనా సరే నా పైసల్ నాకు కావాలి’ అని చెప్పుకొచ్చింది. కరెంట్ బిల్ రూ. 7500 రాగా తాను ఎయిర్‌టెల్ నుంచి కట్టానని, అయినా కట్టలేదని మళ్లీ చెబితే మళ్లీ కట్టానని, ఇంతకీ నా పైసల్ ఎవరు మింగారు బ్యాంక్ వాళ్లా? ప్రభుత్వమా? ఎయిర్‌టెల్ వాళ్లా? అంటూ కేసీఆర్, కేటీఆర్, తెలంగాణ విద్యుత్ బోర్డ్‌ను మాధవీలత నిలదీసింది.