వెండితెరకు ఉన్నఫలంగా దూరమైన నటి మాధవి.. అదే కారణమా?

ఒకప్పటి స్టార్ హీరోయిన్ మాధవి మన హైదరాబాద్ కు చెందిన తెలుగు అమ్మాయి కావడం విశేషం. హీరోయిన్ మాధవి మొదటి సినిమా తూర్పు పడమర అద్భుతమైన ఘన విజయం సాధించడంతో వరస అవకాశాలు ఆమె తలుపు తట్టాయి. మాధవి తన 15 సంవత్సరాల సినీ ప్రస్థానంలో దాదాపు 300 పైగా సినిమాలు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో నటించి అగ్ర హీరోయిన్గా కొనసాగింది. మాధవి అసలు పేరు కనకమహాలక్ష్మి. ఈమెకు భరతనాట్యం అంటే ఇష్టం ఉండడంతో భరతనాట్యాన్ని నేర్చుకొని ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించింది. అలా ఒకరోజు ప్రదర్శన ఇస్తుండగా దాసరి నారాయణరావు గారు చూసి మాధవిని సినిమాల్లో నటించాలని ప్రోత్సహించడంతో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమై ఎన్నో విజయాలను అందుకుంది.

అప్పటి అగ్ర కథానాయకుడు చిరంజీవి గారికి సరైన జోడీగా మాధవిని భావించేవారు. వీరి కాంబినేషన్లో సినిమాలు చేయడానికి చాలామంది దర్శక నిర్మాతలు ఆసక్తి చూపేవారు.ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, దొంగ మొగుడు, ప్రాణం ఖరీదు ,ఖైదీ వంటి బ్లాక్ బాస్టర్ సినిమ వీరి కాంబినేషన్లో వచ్చి సంచలనాలను సృష్టించాయి. హీరోయిన్ మాధవికి మాత్రం ఎమోషనల్ గా మంచి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా మాతృదేవోభవ అని చెప్పొచ్చు. ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరు కంటతడి పెట్టేవారు అంటే ఎంత అద్భుతంగా నటించిందో మీరే అర్థం చేసుకోవచ్చు.

మాధవి స్టార్ హీరోయిన్గా కొనసాగుతుండగానే సినీ జీవితానికి స్వస్తి చెప్పి ప్రముఖ వ్యాపారవేత్త శర్మను వివాహం చేసుకొని విదేశాల్లో స్థిరపడింది. వివాహం తర్వాత ఎన్నో సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ వాటన్నిటినీ వదులుకొని పూర్తిగా తన వ్యక్తిగత జీవితానికే అధిక ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగింది అప్పటినుంచి ఇప్పటివరకు కనీసం మీడియా ముందు కనిపించడానికి కూడా ఆమె ఇష్టపడలేదు.ప్రస్తుతం మాధవి తన భర్త స్థాపించిన సొంత వ్యాపారాలను చూసుకుంటూ మోస్ట్ బిజినెస్ ఉమెన్ గా గుర్తింపు తెచ్చుకుంది.