కరెంట్ బిల్లు కట్టలేదని మెసేజ్ వచ్చిందా… ఇక మీ ఖాతా ఖాళీ అయినట్లే!

ప్రస్తుత కాలంలో మనం ఏ చిన్న పేమెంట్ చేయాలన్నా కానీ మన మొబైల్ నుంచి పేమెంట్ చేస్తున్నాము అది డిష్ బిల్ నుంచి మొదలుకొని కరెంట్ బిల్లు ఇతర అవసరాలన్నింటినీ కూడా మనం యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తూ బిల్లులు పే చేస్తున్నాము. అయితే ఇదే అదునుగా భావించినటువంటి సైబర్ నేరగాళ్లు పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల ద్వారా మనకు మెసేజ్లు పంపించడంతో మన వ్యక్తిగత డేటాను దొంగలిస్తున్నారు.

ఇలా మోసాలకు పాల్పడే వారిలో చాలామంది మీరు కరెంట్ బిల్ చెల్లించలేదా అంటూ ఒక మెసేజ్ ను మనకు పంపిస్తారు. ఈ మెసేజ్ కనుక మనం ఓపెన్ చేసినట్లయితే మన వ్యక్తిగత డేటాను మొత్తం దొంగలించి పూర్తిగా మన ఖజానా ఖాళీ చేస్తూ పెద్ద ఎత్తున మోసాలకు తెరలేపుతున్నారు.ఈ క్రమంలోనే మీరు విద్యుత్ చెల్లించలేదా అని మెసేజ్ కనుక వచ్చినప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చింది మెసేజ్ వచ్చిన ఫోన్ నెంబర్ను ముందుగా తనకి చేయాల్సి ఉంటుంది.

ఒకవేళ మీకు వచ్చినటువంటి మెసేజ్ సరైన ఫోన్ నెంబర్ నుంచి రాలేదని కనుక గుర్తిస్తే వెంటనే ఆ ఫోన్ నెంబర్ వెంటనే సైబర్ పోలీసులకు తెలియజేసి ఫిర్యాదు చేయాలి. ఇలాంటి నెంబర్ల నుంచి ఎలాంటి ఎస్ఎంఎస్ లో కానీ వాట్సాప్ లింక్ కానీ వచ్చిన పొరపాటున దానిని క్లిక్ చేయకూడదు. ఇలా చేస్తే సైబర్ నెరగాళ్లకు మన వ్యక్తిగత డేటాను మొత్తం అందించినట్లే అవుతుంది. తద్వారా మన అకౌంట్ మొత్తం ఖాళీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అందుకే ఇలాంటి నెంబర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచనలు చేస్తున్నారు.