రకుల్ మీద మాధవిలత ఘాటు విమర్శలు.. !

తెలుగు సినిమా పరిశ్రమ తరుపున గతంలో జరిగిన ఒక నిరసన కార్యక్రమంలో పాల్గొన్న టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడిన సంగతి అందరికి తెలిసిందే. తాను ఏ ఇంటర్వ్యూకు వెళ్లినా మీడియా వారు కాస్టింగ్ కౌచ్ గురించి అడుగుతుంటారని, తనకు అలాంటి పరిస్థితి ఎక్కడా ఎదురు కాలేదని చెప్పుకుంటూ వచ్చింది.

ఇండస్ట్రీలో అలాంటిది ఏమీ లేదని తాను ఎన్నో సార్లు చెప్పానని, తెలుగు ఇండస్ట్రీ అస్సలు అలాంటిదేమీ లేకుండా చాలా క్లీన్‌గా ఉందని రకుల్ తెలపడం జరిగింది. అయితే రకుల్ వ్యాఖ్యలను నటి మాధవి లత తప్పుబట్టారు. రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడింది అస్సలు కరెర్ట్ కాదు అంటూ హీరోయిన్ మాధవి లత అప్పుడు కౌంటర్ కూడా ఇచ్చారు.

ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదు, అలాంటి సందర్భాలు కూడా లేవు అని రకుల్ చెప్పడాన్ని తాను అంగీకరించబోనని మాధవి లత తెలిపారు. ఒక ఆడదాన్ని తక్కువగా చూడటం, తప్పుగా మాట్లాడటం అనేది సమాజంలో ప్రతి చోట, ప్రతి రంగంలో ఉంది. అలాంటిది సినిమా ఇండస్ట్రీలో లేదు, నేను వినలేదు, చూడలేదు.

అలా ఉంటే తన పేరెంట్స్ ఎంతో బాధ పడి ఉండేవారనీ కానీ ఇప్పటి వరకు అలా జరగలేదు అని రకుల్ చెప్పడం.. పూర్తిగా నాన్‌సెన్స్ గా ఉందని మాధవి లత గతంలో జరిగిన ఒక్ ఇంటర్వ్యూలో హీరోయిన్ రకుల్ పై మండిపడడం కూడా జరిగింది. అలాగైతే ఎంతో ఫ్రీడమ్ ఉండే హాలీవుడ్ లాంటి ఇండస్ట్రీలోనే కాస్టింగ్ కౌచ్ ఉంది అని #మీటూ కాంపెయిన్ పెడితే ఎంతో మంది రియాక్ట్ అయ్యారు. అప్పట్లో ఎంతో మంది స్టార్ హీరోయిన్లు కూడా సపోర్టు చేశారనీ చెప్పింది.

కానీ మన టాలీవుడ్లో ఒక్క స్టార్ హీరోయిన్ కూడా సపోర్టు చేయదు, మాట్లాడటానికి ముందుకు రారు. అందుకే ఇక్కడ #మీటూ కాంపెయిన్లు జరుగవు కూడా..అని మాధవి లత ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. అప్పుడు రకుల్ ప్రీత్ మాట్లాడింది పూర్తిగా తప్పు అని ఇది అన్ని చోట్లా ఉందనీ అలాగే ఇక్కడ కూడా కొంచెం ఉంటుంది కానీ దాన్ని మనం స్మార్ట్‌గా ఎలా తప్పించుకుని వెళ్లాలో, మంచి మార్గంలో ఎలా వెళ్లాలో అని అర్థమయ్యేట్లు చెబితే దటీజ్ కరెక్ట్ అని రకుల్ మీద అప్పట్లో ఫైర్ అయ్యింది మాధవీ లత.

మాధవి లతా కూడా ఆమె ఇండస్ట్రీకి వచ్చి ఐదేళ్లయింది కానీ ఇప్పటి వరకు ఆమెకు అలాంటివి ఎదురు కాలేదు అని అనడం వంద శాతం తప్పు.. అని మాధవి లత అప్పుడు కౌంటర్లు వేశారు. ఆమె సినిమా ఇండస్ట్రీ బ్యాడ్ అని చెప్పడం లేదనీ ఇలాంటిది అన్ని చోట్లా, అన్ని రంగాల్లో ఉంది. మనం ఎలా దాన్ని తప్పించుకుని ముందుకు వెళ్లాము అనేదే ముఖ్యమని తెలియజేసింది.

కానీ రకుల్ అలాంటి మనిషిని కానీ, నీడను కానీ చూడలేదని స్టేట్మెంట్ ఇవ్వడం పూర్తిగా తప్పని మాధవి లత దానిపై అప్పుడే గరం గరం కూడా అయ్యింది. రకుల్ వాదన నిజమైతే.. హాలీవుడ్లో, బాలీవుడ్లో
మీటూ కాంపెయిన్లో పాల్గొన్నవారంతా అబద్దాలు చెబుతున్నట్లా? అంటే టాలీవుడ్లో జరగడం లేదని చెప్పి జనాలను పిచ్చోళ్లను చేయవద్దనీ ఇది చాలా తప్పనీ అంత పెద్ద హీరోయిన్ అయి ఉండి ఇలా మాట్లాడటం సరికాదని మాధవి లత పేర్కొనడం జరిగింది.