నటి, రాజకీయ నాయకురాలు మాధవీలత సోషల్ మీడియాలో చేసే సెన్సేషన్ గురించి అందరికీ తెలిసిందే. గత రెండు మూడు రోజులుగా తన కరెంట్ బిల్లులో వచ్చిన లోపాల గురించి పోరాడుతూ వస్తూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. నిత్యం ఏదో ఒక వివాదాస్పద పోస్ట్ చేసే మాధవీ తాజాగా అందర్నీ ఏడిపించేసింది. తనకు ఎదురైన ఓ అనుభవం గురించి అందరితో చెప్పుకుంది.
మనసులో మా ట అంటూ.. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మన భారతీయ సంసృతి నేర్పింది , ఎవరు భోజనం చేసేటపుడు కూడా , చిన్న మాటైనా సరే కోపం తో అరవడం , అనకూడని మాటలు అనడం లేదా మాట జారడం ఎటువంటి విషయం ఐన సరే జరగకూడదు.
నా జీవితంలో నిన్న రాత్రి ఆకలితో అన్నం కలుపుకుని మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే కొన్ని మాటలు (చిన్న మాటలే కానీ ) నా మనసుని కలచివేశాయి ,కంచం పక్కన పెట్టి లేచి కళ్ళలో నీళ్లు తురుగుతుండగా చేయి కడుకున్నాను రాత్రి 10 గంటల నుండి ఎంత ప్రయత్నం చేసి ఆపుకున్న కన్నీళ్లు ఇపుడు కళ్ళ నుండి జారుతుంటే చెప్పాలనిపించింది.
ఎవరినైనా సరే అన్నం తింటుండగా కోపం పడవొద్దు నోరు జారొద్దు మాట అనొద్దు మాములుగా వేరు ….ఆకలి వేసిన వేయకున్నా తినడానికి కుర్చునేటపుడు తినేటపుడు వడ్డించేటపుడు
కూడా …….. చెప్పాలి అనిపించింది …… నా జీవితం లో కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా కంచం ముందు నుండి లేస్తాను అని కలలో కూడా అనుకోలేదు అని తనకు ఎదురైన అనుభవాన్ని మాధవీలత పేర్కొంది. ఈ అనుభవం కూడా ఐంది అంతా మన మంచికే ….. మన భారతీయ సంసృతి లో మనకు ఎన్నో గొప్ప విషయాలు అందుకే నేర్పుతారు …. కోటి విద్యలు కూటి కొరకే కదా అంటూ చేదు సంఘటను వివరించింది.