మీనాక్షి చౌదరి గురించి ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు, తమిళ సినిమా పరిశ్రమలోనూ హాట్ హాట్ చర్చ జరుగుతోంది. తాజాగా ఓ తమిళ సినిమాకి కమిట్ అయ్యింది మరి మీనాక్షి చౌదరి.
‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మీనాక్షి చౌదరి. అంతకు ముందు అందాల పోటీలు, మోడలింగ్ ద్వారా గ్లామర్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చిందామె.
ప్రస్తుతం ‘గుంటూరు కారం’తో పాటు తెలుగులో పలు సినిమాలు చేస్తోన్న మీనాక్షి, తాజాగా తమిళంలో ఓ సినిమాకి కమిట్ కాగా, ఇంకో సినిమా ఛాన్స్ కూడా తమిళంలోనే ఆమె కోసం ఎదురుచూస్తోందట.
‘గుంటూరు కారం’ సినిమాలో మీనాక్షికి అవకాశం రాకముందు, ఆమెకు గట్టిగా ఓ పాతిక లక్షల రెమ్యునరేషన్ కూడా పలికేది కాదు. కానీ, ఇప్పుడు దాదాపు కోటికి టచ్ చేస్తోందట. కోటికి తక్కువైతే సినిమా చేసేదే లేదనీ, ముందు ముందు ఇంకా పెరుగుతుందనీ ఆమె అంటోందిట.
లక్కు తోక తొక్కడమంటే ఇదే మరి.! అవకాశాలు వచ్చినప్పుడే కదా, రెమ్యునరేషన్ డిమాండ్ చేయడానికి వీలు కుదిరేది.!