Liger Movie: బర్త్ డే పార్టీ లో ‘లైగర్’ టీమ్.. బ్లాక్ డ్రెస్సుల్లో అదుర్స్.. ఫోటోలు వైరల్!

Liger Movie: టాలీవుడ్‌లో టాప్ మోస్ట్ సెన్సేషనల్ హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా ‘లైగర్’. రీసెంట్‌గా సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్‌లో సత్తా చాటేందుకు సిద్దమవుతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరుగుతోంది. థియేట్రికల్ రైట్స్ కోసం చాలా మంది పోటీపడుతున్నట్టు తెలుస్తోంది.

ఇకపోతే మరోపక్క పార్టీ మూడ్‌ని ఎంజాయ్ చేస్తుంది ‘లైగర్’ టీమ్. ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ సీఈవో అపూర్వ మెహతా పుట్టినరోజు సందర్భంగా ముంబైలో గ్రాండ్ పార్టీ నిర్వహించగా ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ పార్టీలో ‘లైగర్’ బ్యాచ్ పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ, ఛార్మి మరియు అనన్య పాండే కూడా పాల్గొనడం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. నలుపు దుస్తులతో తళుకుమన్న ఈ స్టార్స్ అందరి దృష్టినీ ఆకర్షించారు. అందులో భాగంగా విజయ్ తన స్టైలిష్ లుక్ తో మరోసారి యూత్‌ని ఫిదా చేశాడు.

ఈ పార్టీలో విజయ్ తన కోస్టార్ అనన్య పాండేతో మాట్లాడుకుంటుండగా , ఛార్మి వెనక నుంచి వీడియో తీసి, దాన్ని తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసింది. వాటితో పాటు ఈ ఈవెంట్ కి సంబంధించిన కొన్ని ఫొటోలను షేర్ చేయడంతో ఇప్పుడు ఆ వీడియో మరియు ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. ధర్మ ప్రొడక్షన్స్- పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ లైగర్‌ సినిమా ఆగస్ట్‌25న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు సమాచారం.