Mangli: ప్రముఖ సింగర్ మంగ్లీ వివాదములో చిక్కుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈమె తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ లోని త్రిపుర రిసార్ట్ లో పెద్ద ఎత్తున పార్టీ ఏర్పాటు చేశారు. అయితే ఈ పార్టీలో విదేశీ మద్యం వాడారని అదే విధంగా మాదక ద్రవ్యలు కూడా ఉపయోగించినట్లు పోలీసులు తెలియజేశారు. ఇలా పోలీసుల ఉన్నఫలంగా ఈ రిసార్ట్ పై రైడ్ నిర్వహించడంతో ఒక్కసారిగా ఈ విషయం సంచలనంగా మారింది. ఇలా ఈ డ్రగ్స్ వ్యవహారం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న తరుణంలో మంగ్లీ స్పందించారు.
ఈ సందర్భంగా మంగ్లీ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేస్తూ ఈ వివాదం పై క్లారిటీ ఇచ్చారు. జూన్ 10వ తేదీ నా పుట్టిన రోజు సందర్భంగా ఈ వేడుకను ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా నిర్వహించాలనేది అమ్మ నాన్నల కోరిక అని తెలిపారు. అందుకే కొంతమంది స్నేహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ పార్టీ నిర్వహించామని తెలిపారు . అయితే ఈ సెలబ్రేషన్స్ నిర్వహించాలని ముందుగా ప్లాన్ చేసింది కాదని అప్పటికప్పుడు అనుకోవడం వల్ల పార్టీ నిర్వహించడం కోసం ఎక్సైజ్ నుంచి అనుమతి తీసుకోవాలని, డీజే కోసం అనుమతి తీసుకోవాలనే అవగాహన లేకుండా పోయిందని ఆ విషయం నాకు తెలియదని మంగ్లీ తెలిపారు.
ఇక మేము అక్కడ కేవలం లోకల్ మద్యం మాత్రమే ఉపయోగించాము. విదేశాల నుంచి ఎలాంటి మద్యం తెప్పించలేదు. ఇక అక్కడ డ్రగ్స్ కూడా వాడలేదు, పోలీసులకు డ్రగ్స్ దొరకలేదని మంగ్లీ తెలిపారు. ఇక ఒక వ్యక్తికి పాజిటివ్ వచ్చిన మాట నిజమే కాకపోతే ఆయన గత కొద్ది రోజుల క్రితం ఎక్కడో తీసుకున్నారు ఈ విషయాన్ని స్వయంగా పోలీసులే తెలియజేశారని తెలిపారు. ఇలా కుటుంబ సభ్యుల సమక్షంలో నిర్వహించిన ఈ ఫంక్షన్ లో ఎలాంటి తప్పు జరగలేదని, దయచేసి ఈ విషయాన్ని మీడియా వారు తప్పుగా చిత్రీకరించవద్దు అంటూ మంగ్లీ ఒక వీడియో ద్వారా ఈ ఘటనపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.