రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లైగర్. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాని విడుదలైన పోస్టర్, టీజర్ బాగా ఆకట్టుకొని ఈ సినిమా మీద భారీ అంచనాలను పెంచేసాయి. ఈనెల 25వ తేదీ పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ కి ఈ సినిమా సిద్దమవుతోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా ఓటిటి, శాటిలైట్ రైట్స్ భారీ ధరకి అమ్ముడైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం లైగర్ సినిమా శాటిలైట్ రైట్స్ ని రూ 98 కోట్లకు కైవసం చేసుకుందని సమచారం.
ఈ సినిమా భారీ స్థాయిలో సాటిలైట్ రైట్స్ అమ్ముడు పోవటంతో ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ట్రైలర్ కంచితంగా మాస్ ప్రేక్షకులను అలరించనుంది. అందువల్ల థియేటరికల్ రైట్స్ కి కూడా భారీ డిమాండ్ ఉంటుందని సమాచారం. రూ.160 కోట్లు వ్యయంతో రూపొందిన ఈ సినిమా నాన్ థియేటరికల్ రైట్స్ ద్వారా దాదాపు రూ.98 కోట్లు వసూలు చేసింది. దీంతో బడ్జెట్ లో మగ్జిమం రికవరీ అయినట్టు తెలుస్తోంది. చాలా కాలం తర్వాత లైగర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాతో ప్రేక్షకులను పక్కా ఎంటర్టైన్ చేయనున్నాడని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
ఇదిలా ఉండగా.. ఈరోజు జరిగే ట్రైలర్ లాంచ్ వేడుకలు హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో విజయ అభిమానులు 75 అడుగుల విజయ్ దేవరకొండ కటౌట్ ని అక్కడ ఉంచారు. ఈ సినిమా కోసం విజయ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి తొందర్లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి ప్రధాన పాత్రలో నటించాడు. ఈ సినిమాని చార్మి, పూరి జగన్నాథ్, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించారు.