ప్యాంట్ వేసుకోవడం మరిచింది.. విజయ్ దేవరకొండ హీరోయిన్‌‌పై ట్రోలింగ్

Liger fame Ananya Pandey Trolls on Her dressing

బాలీవుడ్ హీరోయిన్ల వస్త్రాధారణ, అందాల ఆరబోతకు ఎలాంటి హద్దులుండవ్ అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అనన్య పాండే అందాల భామ తెలుగు తెరకు పరిచయం కానుంది. విజయ్ దేవరకొండ హీరోగా వస్తోన్న లైగర్ సినిమాతో అనన్య పాండే దక్షిణాదిని పలకరించబోతోంది. పూరి జగన్నాథ్ ఆమెను ఓ డిఫరెండ్ పాత్రలో చూపించబోతోన్నాడు. ఇక పూరి హీరోయిన్లంటే ఎలా ఉంటారో అందరకీ తెలిసిందే. అయితే తాజాగా లైగర్ ప్రమోషన్స్ పెంచేశారు.

Liger fame Ananya Pandey Trolls on Her dressing
Liger fame Ananya Pandey Trolls on Her dressing

ఈ క్రమంలో లైగర్ రిలీజ్ డేట్ చెబుతామని మేకర్స్ నిన్న వీడియోను రిలీజ్ చేశారు. అందులో అనన్య పాండే, ఆమె ఫ్యామిలీ, పూరి చార్మీ అందరూ కలిసి రచ్చ చేశారు. అనన్య ఫ్యామిలీతో పూరి, ఛార్మీలు కలిసి పార్టీ చేసుకున్నట్టున్నారు. అయితే ఈక్రమంలో బయటకు వచ్చిన ఫోటోల్లో అనన్య షాకింగ్‌గా కనిపించింది. పైన ఒక్క టీ షర్ట్ మాత్రమే ధరించి ఉందన్నట్టు కనిపించింది. కింద ప్యాంట్ వంటిదేమీ ధరించినట్టు కనిపించనేలేదు.

దీనిపై నెటిజన్లు తీవ్రంగా ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. ప్యాంట్ ఎందుకు వేసుకోలేదంటూ అనన్యపై సెటైర్లు వేశారు. మొత్తానికి అనన్య డ్రెస్సింగ్‌తో ఆ ఫోటోలు ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. సెప్టెంబర్ 9న ఈ మూవీ రిలీజ్ కాబోతోందని తాజాగా ప్రకటించారు. ఈమేరకు వదిలిన పోస్టర్‌లో విజయ్ దేవరకొండ దుమ్ములేపేశాడు. ఓ వైపు అనన్య డ్రెస్సింగ్‌పై ట్రోలింగ్.. మరోవైపు ఈ కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ అప్డేట్లతో లైగర్ ట్రెండింగ్‌లో ఉంది.